రివర్స్ గేర్లో మొదలైన నితిన్-పూరి మూవీ
వైష్ణో అకాడమీ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ షెడ్యూల్ తర్వాత గోవా, యూరఫ్‌లలో భారీ షెడ్యూల్ జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు. ఇక్కడ సినిమా ప్రధాన తారగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. హీరోలను సరికొత్తగా ప్రజెంట్ చేసే పూరి నితిన్ ను కొత్త స్టైల్ లో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.
సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ 'పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాను' అన్నారు.


Click it and Unblock the Notifications












