మ్యాచ్ ఓడిపోయారనే బాధ ఉంది.. కానీ అతని వల్ల ఆనందంగా ఉంది.. నితిన్

సోషల్ మీడియా ప్రభావం రోజు రోజుకూ పెరుగుతూ వస్తుండటంతో హీరో హీరోయిన్లు, సెలబ్రిటీలు తమ భావాలను ఇదే వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు నటీనటులు ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అన్ని విషయాలు షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ కోవలో ముందుకెళుతున్న నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు వెన్నల కిషోర్.

ప్రస్తుతం కమెడియన్‌గా రాణిస్తున్న ఈయన సోషల్ మీడియాలోనూ తోటి నటీనటులపై కామెంట్లు పెడుతూ నవ్వులు పూయించడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఆయన పేరును చెబుతూ నితిన్ ఓ ట్వీట్ చేసి ఆకర్షించడం విశేషం.వెన్నెల కిషోర్ కామెడీ ఫేస్‌తో ఉన్న లుక్ ట్విట్టర్‌లో షేర్ చేసిన నితిన్.. ''నిన్న మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉన్నాను.

Nithiin Intresting Tweet On Vennela Kishore

కానీ ఇవ్వాళ స్మార్ట్, హ్యాండ్సమ్ అండ్ క్యూట్ బాయ్ వెన్నెల కిషోర్ తో మొదటి సారి నటిస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను. భీష్మ చిత్రంలో వెన్నెల కిషోర్ రోల్ పరిమళ'' అని ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న నితిన్.. ఈ ఏడాది వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు.

అందులో ఒకటే 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నితిన్ చేసిన ట్వీట్ ద్వారా 'భీష్మ'లో పరిమళగా వెన్నెల కిషోర్ నటన ఆకట్టుకోనుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X