ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం.. త్రివిక్రమ్‌పై నితిన్ కామెంట్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ హీరో నితిన్ ఇది వరకు అ ఆ సినిమాను చేశారు. ఆ చిత్రం నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తరువాత త్రివిక్రమ్ అందించిన కథతో చల్ మోహనరంగ అనే మూవీలో నటించాడు. అయితే వీరిద్దరి మధ్య సినిమాలే కాకుండా గురు శిష్యుల బంధం కూడా ఏర్పడింది. త్రివిక్రమ్‌ను తన గురూజీగా అభివర్ణిస్తుంటాడు నితిన్. తాజాగా త్రివిక్రమ్‌తో కలిసి సందర్భాన్ని చెబుతూ.. ఆయనపై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చాడు.
నితిన్‌కు త్వరలోనే పెళ్లి కాబోతోంది. పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. శనివారం రోజు హల్దీ ప్రోగ్రామ్ (పసుపు కార్యక్రమం) జరిగింది. షాలినితో తనకు పెళ్లి జరగబోతోందని అందరి ఆశీర్వాదం కావాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఇక ఈ వారం తన తదుపరి చిత్రం భీష్మ విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశాడు నితిన్.

రేపు (ఫిబ్రవరి 17) జరుగనున్న భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాబోతోన్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఈ మేరకు నితిన్, త్రివిక్రమ్‌తో కలిసి ముచ్చటించినట్టు సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశాడు. 'గురూజీ త్రివిక్రమ్ గారితో ఉండటం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.. ఆయన్ని నేను ఆరాధిస్తాను.. ఆయనంటే ఎంత ఇష్టమో చెప్పాలంటే మాటలు చిన్నవి అవుతాయి.. ఆయన మమ్మిల్ని ఆశీర్వదించడానికి భీష్మ ఈవెంట్‌కు వస్తున్నాడని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంద'ని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











