twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పార్ట్ 2 అన్నారు., నితిన్ అన్నాడు,హీరో నితిన్ కాదట: ప్రవీణ్..! ఏందీ కన్ఫ్యూజన్?

    |

    చాలా రోజుల త‌ర్వాత సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్‌ను ఆనందంలో ముంచెత్తిన సినిమా గ‌రుడ వేగ‌. ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా సంచ‌లన విజ‌యాన్ని సాధించింది. దీంతో ప్ర‌వీణ్ స‌త్తారు సత్తా అంద‌రికీ తెలిసింది. చందమామ కథలు చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు తాజాగా పీఎస్‌వీ గరుడ వేగ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టాడు. ప్ర‌వీణ్ ఇప్పుడు నితిన్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

    Recommended Video

    Nithin Love Affire With A Star Heroine యువ హీరోయిన్‌తో నితిన్ పెళ్లి..
     దర్శకుడు ప్రవీణ్ సత్తారు

    దర్శకుడు ప్రవీణ్ సత్తారు

    త‌న స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట మూవీస్ త‌ర్వాతి సినిమాను ప్ర‌వీణ్ డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ని ట్విట‌ర్ ద్వారా నితిన్ ప్ర‌క‌టించాడు. గరుడ వేగ సినిమా హిట్ కావడంతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ఎంక్వయిరీలు మొదలయ్యాయి. అప్పడే ఓ రుమాలు పడిపోయింది.

     ఇంకా క‌న్ఫామ్ కాలేదు

    ఇంకా క‌న్ఫామ్ కాలేదు

    హీరో నితిన్ తన స్వంత బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు తనే ట్విట్టర్ లో ప్రకటించేసాడు. అయితే ఇక్కడే చిన్న తకరారు వుంది. అందరూ నితిన్ నే హీరోగా ప్రవీణ్ సత్తారుతో సినిమా చేస్తున్నాడేమో అని అనేసుకున్నారు. అయితే ఈ సినిమాలో నితిన్ హీరోనా, కాదా? అనేది ఇంకా క‌న్ఫామ్ కాలేదు.

    ప్ర‌వీణ్ రాసిన క‌థ‌ను బ‌ట్టి

    ప్ర‌వీణ్ రాసిన క‌థ‌ను బ‌ట్టి

    ప్రవీణ్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా నిర్మిస్తున్న‌ట్టు నితిన్ ప్ర‌క‌టించాడు త‌ప్ప‌.. నితిన్ హీరోగా మాత్రం కాదు. నితిన్ స్వంత బ్యానర్ లో ఓ సినిమా చేయడం పక్కా, హీరో ఎవరు అన్నది, ప్రాజెక్టు ఫైనల్ అయ్యాక తేలుతుంది అని ఆయన చెబుతున్నారు. ప్ర‌వీణ్ రాసిన క‌థ‌ను బ‌ట్టి హీరో సెల‌క్ష‌న్ ఉంటుంద‌ని స‌మాచారం.

    వేరే హీరోతో

    వేరే హీరోతో

    ప్ర‌వీణ్ త‌యారు చేసిన స్క్రిప్టు త‌న‌కు స‌రిపోయే విధంగా ఉంటే నితిన్ న‌టిస్తాడ‌ని, లేదా వేరే హీరోతో ఆ సినిమాను నిర్మిస్తాడ‌ని తెలుస్తోంది. నితిన్ హీరోగా మాత్రం కాదు. నితిన్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక రాధామోహన్ నిర్మాతగా ఓ సినిమా చేయాల్సి వుంది.

    గరుడవేగ పార్ట్-2

    గరుడవేగ పార్ట్-2

    ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు.. పుల్లెల గోపీచంద్ బయోపిక్ మూవీతో పాటు ‘గరుడవేగ పార్ట్-2'ను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉండగా, నితిన్‌ రౌడీ ఫెల్లో ఫేమ్‌ కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లు సంయుక్తంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. లై బ్యూటీ మేఘా ఆకాశ్‌ మరోసారి నితిన్‌ పక్కన మెరవనుంది.

    English summary
    Tollywood actor Nithiin announced his next project and this time, he is set to work with film director Praveen Sattaru, who recently scored a super hit “PSV Garuda Vega” with actor Rajasekhar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X