నితిన్ హీరోగా....పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న మూవీ లేటెస్ట్ అప్డేట్స్
నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మించే సినిమా మొదలైంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం గతేడాది నవంబర్లో జరిగింది.
'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరుతో ఓ బేనర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ బేనర్లో నితిన్ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ భాగస్వామ్యం కూడా ఉంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మూల కథ అందించిన ఈ చిత్రం 2016 నవంబర్లో ప్రారంభోత్సవం జరుపుకోగా.... దాదాపు 9 నెలల అనంరతం ఈ రోజు(జులై 24, 2017) రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.

ఫస్ట్ షెడ్యూల్
తొలి షెడ్యూల్ ఐదు రోజుల పాటు హైదరాబాదులో జరుగనుంది. తర్వాత భారీ షెడ్యూల్ కోసం ఆగస్టులో చిత్ర యూనిట్ అమెరికా వెళ్లనుంది. ఈ సినిమాలో నితిన్ తో పాటు మేఘా ఆకాశ్, రావు రమేష్, నరేష్, ప్రగతి, లిజీ, నర్రా శ్రీను, శ్రీనివాసరెడ్డి, మధు తదితరులు నటిస్తున్నారు.
Recommended Video


కృష్ణ చైతన్య
ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగులు అందించే బాధ్యత కూడా అతడే నిర్వహిస్తుండటం విశేషం.

తొలిసారి
తొలిసారి పవన్ కళ్యాణ్ తాను కాకుండా తన బ్యానర్ పై మరో హీరో నితిన్ కొసం నిర్మాతగా మారటం విశేషం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలతో పాటు మూల కధను సమకూర్చటం మరో హైలెట్.

నితిన్
పవన్ కళ్యాణ్, యంగ్ హీరో నితిన్ ల అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తన సొంత సినిమా ఫంక్షన్లకైనా మిస్ అవుతాడేమో కాని నితిన్ సినిమా ఫంక్షన్ కు పవన్ ఎప్పుడూ మిస్ కాలేదు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నితిన్ కూడా తన ప్రతీ సినిమాలో పవర్ స్టార్ ప్రస్థావన తేకుండా ఉండడు. ఎన్నో వేదికల మీద పవర్ స్టార్ తన అభిమాన హీరో అని ప్రకటించాడు నితిన్. అందుకే నితిన్ సినిమాలకు పవన్ అభిమానులు కూడా అండగా ఉంటూ వస్తున్నారు.


Click it and Unblock the Notifications











