పెళ్లిని కూడా వాయిదా వేశా.. నా బర్త్ డేను సెలెబ్రేట్ చేయకండి.. ఫ్యాన్స్‌ను వేడుకున్న నితిన్
కరోనా వైరస్ వచ్చి ఎంతో మందిని ఎన్నో రకాలుగా ముప్పు తిప్పలు పెడుతోంది. కరోనా ధాటిని ప్రపంచం మొత్తం కుదేలవుతోంది. ఇప్పటికే కరోనా లక్షల మందికి సోకగా వేల మందిని పొట్టనబెట్టుకుంది. కరోనా తాకిడిని తట్టుకోలేక దేశాలకు దేశాలే లాక్ డౌన్‌లోకి వెళ్లాయి.

అన్ని కార్యక్రమాలు రద్దు..
కరోనా ధాటిని మన దేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్‌ను విధించారు. దీంతో అన్ని కార్యక్రమాలు రద్దు అయ్యాయి. అత్యంత ఘనంగా నిర్వహించాలనుకున్న వివాహా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అందులో యంగ్ హీరో నితిన్ పెళ్లి కూడా ఉంది.

ప్రేమ వివాహం..
నితిన్ షాలినీలు గత కొన్నేళ్లుగా రహస్యంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే పెద్దల అంగీకారంతో ఏప్రిల్‌లో వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఎంగేజ్మెంట్ ఎంతో అట్టహాసంగా జరగ్గా.. డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా పెళ్లిని దుబాయ్‌లో ఏర్పాటు చేశారు. అయితే కరోనా విజృంభించడంతో ఆ పెళ్లి వాయిదా పడింది. ఈ మేరకు నితిన్ ఓ ప్రకటన చేశాడు.

బర్త్ డేను సెలబ్రేట్ చేయకండి..
‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడి ఉన్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఎవరూ బయటకు రావకూడదని లాక్ డౌన్ కాలంలో మార్చి 30న నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టిన రోజు వేడుకలను జరుపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.

పెళ్లి కూడా వాయిదా..
అంతేకాదు లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16న జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లొ మనం కాలు మీద కాలేసుకుని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్టు. ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే మీ నితిన్' అంటూ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











