నితిన్, రకుల్, ప్రియావారియర్ కాంబోలో వి. ఆనందప్రసాద్ న్యూ మూవీ స్టార్ట్
యూత్ స్టార్ నితిన్ హీరోగా అభిరుచి గల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నితిన్, ప్రియా వారియర్ రొమాన్స్ చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మరో హీరోయిన్. వి.ఆనందప్రసాద్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు (జూన్ 23) హైదరాబాద్‌లో లాంఛనంగా జరిగాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ రోజు జరిగిన ముహూర్తపు కార్యక్రమానికి చిత్రయూనిట్ సహా.. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విచ్చేశారు. సంస్థ కార్యాలయంలో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్‌కొట్టారు.

ఈ సందర్బంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ ''యూత్‌స్టార్ నితిన్‌కి పక్కాగా సరిపోయే కథతో సినిమా తీస్తున్నాం. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన కెరీర్‌లో ఇది చెప్పుకోదగ్గ సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ప్రేక్షకుల గురించి నాకు బాగా తెలుసు. ఆయన తీసుకునే పాయింట్ అంత గొప్పగా, వైవిధ్యంగా ఉంటుంది. మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలం. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.
కీరవాణి సంగీతం ఈ సినిమాకు అతిపెద్ద ఎసెట్. హీరోయిన్లుగా రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. రకుల్ ఇంతకు ముందు మా సంస్థలో లౌక్యంలో నటించారు. యూత్‌లో ప్రియా ప్రకాష్ వారియర్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆమెను తెలుగులో మా సంస్థ ద్వారా పరిచయం చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. షూటింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం'' అన్నారు.
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.12 గా ఈ సినిమా రూపొందనుంది. చిత్రానికి రచన, దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి, నిర్మాత: వి. ఆనందప్రసాద్ కాగా రాహుల్ శ్రీవాస్తవ్ ఛాయాగ్రహణం అందించనున్నారు. ఇతర వివరాలు చూస్తే..
సంగీతం: కీరవాణి
రచనా సహకారం, మాటలు: వెంకట్ నరేష్ రెడ్డి
కళా దర్శకత్వం: వివేక్ అన్నామలై
కాస్ట్యూమ్స్: కృష్ణ శాంతి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పి.యల్.యం.ఖాన్.


Click it and Unblock the Notifications











