నితిన్ రొమాంటిక్ సినిమాకు మరో క్రేజీ ఆఫర్.. డీల్ క్లోజ్!
చెక్ సినిమాతో గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం న్యూ బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి నితిన్ రొమాంటిక్ సినిమాతో రెడీ అవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక సినిమా ప్రమోషన్ డోస్ పెంచడానికి నితిన్ ప్లాన్స్ గట్టిగానే వేస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక సినిమా ప్రీ రీలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే ఉంది. మార్చి 26న విడుదల కాబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ ధర పలికినట్లు సమాచారం.

1.5కోట్లతో సినిమా ఓవర్సీస్ రైట్స్ ను ఫార్స్ ఫిలిమ్స్ అనే సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక యూఎస్ లో కూడా ఈ సినిమా కోసం ఓ వర్గం ఆడియెన్స్ బాగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే యూఎస్ లో తెలుగు సినిమాలకు మార్కెట్ పెరుగుతోంది. జాతిరత్నాలు సినిమాకు అయితే మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక రంగ్ దే సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications











