OTT: నితిన్ కొత్త సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... ఎప్పుడంటే?
టాలీవుడ్ యువ హీరో నితిన్ లాక్ డౌన్ అనంతరం ఈ ఏడాది నెల గ్యాప్ లోనే రెండు సినిమాలతో వచ్చాడు. గత ఏడాది లాక్ డౌన్ కంటే కొన్ని రోజుల ముందు భీష్మ సినిమాతో సాలీడ్ హిట్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ నితిన్ మార్కెట్ ను కూడా అమాంతంగా పెంచేసింది.
ఇక మళ్ళీ వెంటనే కమర్షియల్ సినిమా చేయకూడదని చెక్ అనే డిఫరెంట్ మైండ్ గేమ్ సినిమా చేశాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. ఇక పెద్దగా గ్యాప్ లేకుండా మళ్ళీ వెంటనే రంగ్ దే సినిమాను విడుదల చేశాడు. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. మొదట రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

కానీ చివరికి సినిమా కమర్షియల్ గా నష్టాలను అందుకుంది. కోవిడ్ ప్రభావం కూడా ఎక్కువగా పడింది. ఇక ఫైనల్ గా రంగ్ దే సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మొదట ఆగస్ట్ నెలలో రావచ్చని రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ అబద్ధాలు అని తేలిపోయింది.
జూన్ 12న జీ 5లో విడుదల కాబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. నితిన్ - కీర్తి సురేష్ నటన ఈ సినిమాలో కాస్త ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన రొమాంటిక్ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఓటీటీలో రంగ్ దే ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











