ఒక్క సారి వెనక్కి తిరిగిచూసుకున్న నితిన్.. ఆ దర్శకుడి కోసం పరుచూరి, కాజల్ కూడా!

హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న చల్ మోహన్ రంగ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటీవల నితిన్ తన జీవితంలో మరపురాని రోజుని మరో మారు గుర్తు చేసుకున్నాడు. తేజ దర్శకత్వంలో నితిన్ తన కెరీర్ ఆరంభించాడు. 2003 లో జయం చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. తేజ మార్క్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో యువతని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ చిత్ర షూటింగ్ మొదలైన రోజు ఫిబ్రవరి 22, 2002. ఈ సందర్భంగా తేజ ఆ మధురజ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నాడు. తనని చిత్ర పరిశ్రమకు విజయవంతంగా పరిచయం చేసిన తేజకు నితిన్ కృతజ్ఞతలు తెలియజేసాడు.

Recommended Video

Chal Mohan Ranga First Look
మొట్టమొదటిసారి

మొట్టమొదటిసారి

నితిన్ మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన రోజు ఫిబ్రవరి 22. తేజ దర్శత్వంలో జయం చిత్రం ద్వారా నితిన్ తన కెరీర్ ని ఘనంగా ఆరంభించాడు. జయం చిత్రం అఖండ విజయం సాధించింది. నితిన్ తొలిప్రయత్నంలోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు.

తేజకు కృతజ్ఞతలు

తేజకు కృతజ్ఞతలు

హీరోగా తనకు అవకాశం ఇచిన తేజకు నితిన్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు. 2002 లో జయం షూటింగ్ ఆరంభమైంది ఈ రోజే. థాంక్యూ తేజ సార్ అంటూ నితిన్ ట్వీట్ చేసాడు.

మరో ప్రత్యేకత కూడా

మరో ప్రత్యేకత కూడా

ఫిబ్రవరి 22 జయం సినిమా షూటింగ్ మొదలైన రోజు మాత్రమే కాదు దర్శకుడు తేజ జన్మదినం కూడా. దీనితో నితిన్ తేజకు శుభాకాంక్షలు తెలియజేసాడు. సెలెబ్రిటీల నుంచి తేజ శుభాకాంక్షలు అందుకున్నారు.

 నితిన్ కెరీర్ చాలా ఆసక్తికరం

నితిన్ కెరీర్ చాలా ఆసక్తికరం

నితిన్ కెరీర్ ని గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జయం చిత్రం తరువాత నితిన్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. దిల్, సై చిత్రాలతో నితిన్ దూసుకుపోయాడు. స్టార్ దర్శకులు నితిన్ తో సినిమా తీయడానికి ఎగబడ్డారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.

పదేళ్లు పడిగాపులు, ఓ పాఠమే

పదేళ్లు పడిగాపులు, ఓ పాఠమే

సై చిత్రం తరువాత నితిన్ పదేళ్లు విజయం కోసం పడిగాపులు కాచాడు. అయినా శక్తివంచన లేకుండా ఓపిగ్గా విజయం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇష్క్ చిత్రంతో విజయం సాధించి మళ్ళీ ట్రాక్ లోకి ఎక్కాడు. యువ హీరోలకు నితిన్ కెరీర్ ఓ పాఠమనే చెప్పొచ్చు.

 తేజ గురించి పరుచూరి

తేజ గురించి పరుచూరి


తేజ పుట్టిన రోజు సందర్భంగా రచయిత పరుచూరి గోపాల కృష్ణ శుభాకాంక్షలు తెలియజేసారు. సృజనాత్మకత ఉన్న దర్శకులలో తేజ కూడా ఒకరని అయన అన్నారు.

 కాజల్ ఏమందంటే

కాజల్ ఏమందంటే

తన మెంటర్, డైరెక్టర్ తేజకి శుభాకాంక్షలు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. అయన ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కాజల్ ట్వీట్ చేసింది.

నితిన్, తేజ ఇద్దరూ అంతే..

నితిన్, తేజ ఇద్దరూ అంతే..

నితిన్ కు వలె దర్శకుడు తేజకి కూడా కొన్ని ఏళ్ల పాటు విజయం కరువైంది. గత ఏడాది నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తేజ ఎట్టకేలకు విజయాన్ని అందుకున్నారు.

చేతిలో బిగ్ ప్రాజెక్ట్స్

చేతిలో బిగ్ ప్రాజెక్ట్స్

చల్ మోహన్ రంగ చిత్రం తరువాత నితిన్ దిల్ రాజు నిర్మాణంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయో పిక్ ని రూపొందించే పనిలో ఉన్నారు. విక్టరీ వెంకటేష్ తో కూడా తేజ ఓ చిత్రాన్ని చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X