ఇప్పటి వరకు ఓ లెక్క.. చెక్ తర్వాత మరో లెక్క.. నితిన్ ఎమోషనల్
హీరో నితిన్ మాట్లాడుతూ.. చెక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి, రమక్క (రమ రాజమౌళి) ధన్యవాదాలు. ఇక వరుణ్ తేజ్ నాకు ట్రూ ఫ్రెండ్. మీరు తెలుగు సినిమాను ప్రపంచ పటంపై పెట్టారు. అలాంటి మీతో నేను మీరు రూపొందించిన సై చిత్రంలో నటించే అవకాశం దక్కింది. నా కెరీర్‌లో గుర్తుంచుకొనే చిత్రంగా మిగిలింది. సై చిత్రం కూడా రగ్బీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. ఇప్పుడు చెక్ సినిమా కూడా క్రీడా నేపథ్యం ఉన్న చిత్రం కావడం హ్యాపీగా ఉంది.

చంద్రశేఖర్ యేలేటి లాంటి దర్శకుడితో చెక్ సినిమా చేయడం లక్కీగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా యాక్టింగ్ ఒక లెక్క.. చెక్ తర్వాత మరో లెక్క. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ చెక్ సినిమా షూటింగులో ఎన్నో టేకులు తీసుకొన్నాను. నాకు డిఫరెంట్ యాక్టింగ్‌ను చంద్రశేఖర్ యేలేటి నేర్పించారు. చెక్ సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి మనకు మంచి పేరు వస్తుందని చెబితే.. నాకు పేరు వద్దు.. డబ్బులు రావాలని కోరుకొంటున్నానని చంద్రశేఖర్ యేలేటి చెప్పారు. కల్యాణీ మాలిక్ ఈ చిత్రానికి బిగ్గెస్ట్ పిల్లర్. మేము 50 శాతం పనిచేస్తే మీరు మరో లెవెల్‌కు తీసుకెళ్లారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











