లౌక్యంతో రకుల్ దశ తిరిగింది.. చెక్‌తో ప్రియా వారియర్‌‌కు అంతే.. నిర్మాత ఆనంద ప్రసాద్

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద ప్రసాద్ నిర్మాతగా నితిన్, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చెక్. ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. ఈ చిత్రం ఫిబ్రవరి 26 తేదీన రిలీజ్‌కు సిద్ధమై ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా జరుపుకొంటున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం ఫిబ్రవరి 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. చెక్ యూనిట్‌ను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అగ్ర దర్శకులు ఎస్ఎస్ రాజమౌళికి, వరుణ్ తేజ్, గోపిచంద్ మలినేని, వెంకీ కుడుములకు ధన్యవాదాలు. కరోనా సమయంలో 2020 సంవత్సరంలో మేము ఓ పిట్టకథ, మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశాం. మంచి హిట్లను సాధించాం. ఇలాంటి రెండు విజయాల తర్వాత మేము చెక్ సినిమాతో ముందుకు వస్తున్నాం. నాకు ఇష్టమైన డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి, యూత్‌ఫుల్ హీరో నితిన్ కాంబినేషన్‌లో చెక్‌ మూవీని నిర్మించాం. ఇది మాకు గొప్ప కాంబినేషన్. నితిన్‌ ఎప్పటికీ గుర్తుంచుకొనే చిత్రంగా చెక్ మిగిలిపోతుంది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్‌ను ఇంతకు ముందు చేయలేదు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నితిన్ విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రంలో నటులు కాకుండా క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తాయి. అది మా డైరెక్టర్ గొప్పతనం అని అన్నారు.

Nithiins Check movie pre release event: Producer V Anand Prasad speech

ఇక రకుల్ ప్రీత్ సింగ్ లౌక్యం సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమాలో నటించారు. లౌక్యం చిత్రం తర్వాత రకుల్ స్టార్ హీరోయిన్ అయింది. ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్ తొలిసారి మా బ్యానర్‌లో నటించారు. ప్రియా వారియర్‌కు కూడా మంచి భవిష్యత్ ఉండాలని కోరుకొంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, మిర్చి సంపత్ కాంబినేషన్‌ లౌక్యం చిత్రంలో హిట్ అయింది. మళ్లీ ఈ చిత్రంలో వారిద్దరు కలిసి నటించడం మాకు సెంటిమెంట్‌గా మారుతుందని భావిస్తున్నాను అని నిర్మాత ఆనంద ప్రసాద్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X