చెక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ జోష్.. నా తమ్ముడు అంటూ సాయిచంద్..
యూత్ స్టార్ నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో, హీరోయిన్లుగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత వీ ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం చెక్.
చెక్ చిత్రం ఫిబ్రవరి 26 తేదీన రిలీజ్‌కు సిద్ధమై ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా జరుపుకొంటున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఫిబ్రవరి 21వ తేదీన (ఆదివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్ర దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ వేడుకలో సీనియర్ నటుడు సాయిచంద్ మాట్లాడుతూ... 1980 నుంచి నేను హీరోగా, నటుడిగా నా ప్రయాణం మొదలైంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిదాతో ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమాలో నా నటనకు మంచి ఆదరణ లభించింది. అదే ప్రేమను నాపై కురిపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది.
చెక్ సినిమా కోసం దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఫోన్ చేసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఆయనను కలిసినప్పుడు నా పాత్రను బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షాతో చేయించాలని అనుకొన్నారట. కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో నాతో చేయించాలని నిర్ణయం తీసుకొన్నారు అని సాయి చంద్ తెలిపారు.
ఈ వేడుకకు హాజరైన ప్రేక్షకులను ఉత్సాహ పరిచేందుకు సాయిచంద్ ప్రయత్నించారు. నా తమ్ముడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వచ్చారా అని అడగడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున్న జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశారు


Click it and Unblock the Notifications











