For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ: నితిన్ రెండు షాక్‌లు.. అప్పుడే మూవీకి అలాంటి టాక్

  |

  హీరోగా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగానే పెంచుకున్నాడు. అయితే, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వరుసగా ఫ్లాపులను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'భీష్మ'తో భారీ సక్సెస్‌ను కూడా అందుకుని సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులు ఎదరయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాలో నటించాడు. మాస్ యాక్షన్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూడండి!

  మాచర్ల నియోజకవర్గంలోకి నితిన్

  మాచర్ల నియోజకవర్గంలోకి నితిన్

  యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా చిత్రమే 'మాచర్ల నియోజకవర్గం'. ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మించారు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు.

  శ్రీయ అందాల ఆరబోత: తల్లయ్యాక కూడా ఇంత హాట్‌గానా!

  అలాంటి స్టోరీ.. భారీ అంచనాలు

  అలాంటి స్టోరీ.. భారీ అంచనాలు

  గుంటూరు జిల్లాలో పని చేస్తోన్న ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఎలా పోరాటం చేశాడు అనే నేపథ్యంలో 'మాచర్ల నియోజకవర్గం' మూవీ తెరకెక్కింది. పూర్తి స్థాయి మాస్ మసాలా అంశాలతో రూపొందిన ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్లు ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు కూడా తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

  బిజినెస్ తగ్గట్లుగా.. గ్రాండ్ రిలీజ్

  బిజినెస్ తగ్గట్లుగా.. గ్రాండ్ రిలీజ్

  నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి నైజాంలో రూ. 6 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 21.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది.

  ఆగిపోయిన హీరోయిన్ పూర్ణ పెళ్లి: క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టా పోస్ట్.. ఆ ఫొటో షేర్ చేయడంతో!

  నితిన్ సినిమాకు అలాంటి టాక్

  నితిన్ సినిమాకు అలాంటి టాక్

  నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికీ యూఎస్ సహా ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే షోలు ప్రారంభం అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు ఊహించని విధంగా మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. విశేషం ఏంటంటే.. దీనికి షోలు పడకున్నా దీనికి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  'మాచర్ల నియోజవకర్గం' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయంతో పాటు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి చాలా సమయం తీసుకున్నాడట. అయితే, ఇంటర్వెల్ మాత్రం బాగుంటుందట. ఇక, సెకెండాఫ్ మాత్రం ప్రత్యర్థి వర్గంతో హీరో పోరాడే సన్నివేశాలతో సాగుతుందట. అలాగే, క్లైమాక్స్ ఊహించనట్లుగానే ఉందట.

  Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్

  మూవీ ప్లస్‌.. మైనస్‌ పాయింట్లు

  మూవీ ప్లస్‌.. మైనస్‌ పాయింట్లు


  'మాచర్ల నియోజకవర్గం' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో నితిన్ తనదైన మాస్ ట్రీట్‌తో వన్ మ్యాన్ షో చేశాడట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని తెలిసింది. అయితే, కామెడీ అంతగా లేకపోవడం, లాజిక్ లేని సీన్లు, ఎమోషన్స్ పండకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారాయని టాక్.

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే


  ట్విట్టర్‌లో అందుతోన్న సమాచారం ప్రకారం.. నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది. ఇందులో నితిన్ ఇప్పటి వరకూ కనిపించని మాస్ అవతారంలో కనిపించాడట. ఫ్యాన్స్‌ను అలరిస్తుందని.. ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లే వాళ్లకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

  బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే!

  రిలీజ్‌కు ముందే రెండు షాక్‌లు

  రిలీజ్‌కు ముందే రెండు షాక్‌లు

  నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి రిలీజ్ రోజే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు సంబంధించి యూఎస్‌లో ప్రీమియర్స్ అన్ని క్యాన్సిల్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇది కలెక్షన్లపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే, ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో వచ్చిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. ఈ సినిమాపై పలువురు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.

  English summary
  Nithiin Did Macherla Niyojakavargam Under M.S. Rajashekhar Reddy Direction. Now Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X