Maestro Full Movie: నితిన్‌కు బిగ్ షాక్.. రిలీజ్ అయిన గంటల్లోనే లీక్.. ఆ సైట్‌లో డౌన్‌లోడ్ లింక్

సినీ పరిశ్రమలు ఎంతో కాలంగా ఎదుర్కొంటోన్న సమస్యల్లో పైరసీ గురించి ప్రధానం చెప్పుకోవాలి. థియేటర్లలో సినిమాలు విడుదలైన కొంత సమయంలోనే సీడీల రూపంలో ప్రింట్లు బయటకు వచ్చేసేవి. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత దీని బెడద మరింత ఎక్కువ అయిపోయింది. ఫలితంగా దీని ప్రభావం సినిమా కలెక్షన్లపైన కూడా భారీ స్థాయిలో పడుతోంది. ఇక, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల సంగతి అస్సలు చెప్పనక్కర్లేదు. అక్కడ స్ట్రీమింగ్ మొదలైన వెంటనే ఇవన్నీ లీకైపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ 'మాస్ట్రో' మూవీ కూడా బయటకు వచ్చేసింది. ఆ సంగతులు మీకోసం!

‘మాస్ట్రో'గా వచ్చిన యూత్ స్టార్

‘మాస్ట్రో'గా వచ్చిన యూత్ స్టార్

యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా చిత్రం 'మాస్ట్రో'. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా కాగా.. తమన్నా నెగెటివ్ రోల్ చేసింది. దీన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఇందులో శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, జిస్సుసేన్ గుప్తా, నరేష్ కీలక పాత్రలు చేశారు.

పెరిగిన అంచనాలు.. భారీ ధరకు

పెరిగిన అంచనాలు.. భారీ ధరకు

టీజర్, ట్రైలర్, పాటలు విడుదలైన తర్వాత 'మాస్ట్రో' మూవీపై భారీ స్థాయిలో ఆసక్తి పెరిగిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా రూ. 32 కోట్లు వెచ్చించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో విడుదలకు ముందే నితిన్‌కు టేబుల్ ప్రాఫిట్ సొంతం అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

 పాజిటివ్ రెస్పాన్స్.. హిట్ టాక్‌తో

పాజిటివ్ రెస్పాన్స్.. హిట్ టాక్‌తో

ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మాస్ట్రో' మూవీ ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో, ఓవర్సీస్‌లో బిగ్ స్క్రీన్‌లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అదే సమయంలో దీనికి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. దీంతో డిస్నీ సంస్థకు క్లిక్కుల మీద క్లిక్కులు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఫుల్ ఖుషీగా ఉన్నాడు నితిన్.

రెండు ఫ్లాపుల తర్వాత విజయం

రెండు ఫ్లాపుల తర్వాత విజయం

ఈ సంవత్సరం నితిన్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో 'చెక్' అనే సినిమాలో నటించాడు. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అనే సినిమాలోనూ నటించాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలు రెండూ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. ఇలా ఫ్లాపుల తర్వాత నితిన్‌ 'మాస్ట్రో'తో విజయాన్ని అందుకున్నాడని అంటున్నారు.

లీకైన నితిన్ ‘మాస్ట్రో' సినిమా

లీకైన నితిన్ ‘మాస్ట్రో' సినిమా

వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న నితిన్‌ నటించిన తాజా చిత్రం 'మాస్ట్రో'. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అదే సయమంలో థియేటర్లలో విడుదల చేయకపోవడంపై నితిన్ అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'మాస్ట్రో' మూవీ కొన్ని వెబ్‌సైట్లలో లీకైపోవడం షాక్‌కు గురి చేస్తుంది.

విడుదలైన గంటల్లోనే బయటకు

విడుదలైన గంటల్లోనే బయటకు

నితిన్ నటించిన 'మాస్ట్రో' మూవీ శుక్రవారం తెల్లవారుజామున నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. ఇలా వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ మూవీ బయటకు వచ్చేసింది. హెచ్‌డీ క్వాలిటీతో మూవీ రూల్జ్, ఐబొమ్మ వంటి కొన్ని వెబ్‌సైట్లలో ఇది ప్రత్యక్షం అయిపోయింది. దీనిపై నితిన్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. అటువంటి లింక్స్ కనిపిస్తే రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నారు.

Recommended Video

Nithiin Vinayaka Chavithi Special Interview | Maestro Movie
అవన్నీ లీక్ అవడంతో షాకులు

అవన్నీ లీక్ అవడంతో షాకులు

ఇప్పుడు నితిన్ 'మాస్ట్రో' మూవీ మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో విడుదలైన చిత్రాలు చాలా ఇలా రిలీజ్ రోజే లీకయ్యాయి. మరీ ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం స్ట్రీమింగ్ అయిన నాని 'టక్ జగదీష్' మూవీ కూడా విడుదలైన కొన్ని గంటల్లోనే వెబ్‌సైట్లలో ప్రత్యక్షం అయింది. పెద్ద సినిమాలే కాదు.. చిన్న చిన్న చిత్రాలు కూడా ఇలా లీక్ అవడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X