షాకింగ్ అప్‌డేట్: నితిన్ ప్రేమ వివాహం.. కారణం ఓ యంగ్ హీరోయిన్!! ఆమెనే స్వయంగా..

యంగ్ హీరో నితిన్ అతిత్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన యువతి శాలినిని ఆతను పెళ్లాడబోతున్నాడు. సుదీర్ఘకాలం పాటు సాగిన తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో మరింత పటిష్టం చేయబోతున్నాడు. అయితే నితిన్ ప్రేమ వివాహానికి కారణం రష్మిక మందన్న అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు సంగతేంటి? నితిన్ పెళ్ళికి, రష్మికకు లింక్ ఏంటి? వివరాల్లోకి పోతే..

రహస్యంగా ప్రేమాయణం.. ఇలా బయటపడింది

రహస్యంగా ప్రేమాయణం.. ఇలా బయటపడింది

షాలిని రెడ్డి- నితిన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. కానీ ఈ విషయం బయటకు మాత్రం రాలేదు. ఏ మాత్రం సమాచారం బయటకు తెలియకుండా రహస్యంగా ప్రేమాయణం నడిపించిన నితిన్.. పెద్దలను ఒప్పించాకే అసలు విషయం బయటపెట్టాడు.

అంతా అలా అనుకున్నారు.. కానీ నితిన్ ప్రకటనతో..

అంతా అలా అనుకున్నారు.. కానీ నితిన్ ప్రకటనతో..

నితిన్‌కు పెళ్లి కుదిరిందనే విషయం బయటకు రావడంతో అంతా పెద్దలు కుదిర్చిన వివాహం అని అనుకున్నారు. కానీ, ఇది లవ్ అండ్ అరేంజ్‌డ్ మ్యారేజ్ అని నితిన్ స్వయంగా ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. నితిన్ పెళ్లి పనులను పసుపు, కుంకుమ కార్యక్రమంతో లాంఛనంగా శనివారం రోజు ప్రారంభించారు. ప్రస్తుతం నితిన్- షాలినీ జోడీ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది.

నితిన్ వివాహానికి ముహూర్తం

నితిన్ వివాహానికి ముహూర్తం

శనివారం నాడు హైదరాబాద్‌లోని త‌న‌ నివాసంలో షాలినితో నిశ్చితార్ధ వేడుక‌ జ‌రుపుకున్నాడు నితిన్‌. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 16న వివాహానికి ముహూర్తం పెట్టేశారు. దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో నితిన్‌, షాలినిల వివాహ వేడుక జరగనుంది.

నేనే కారణం.. రష్మిక స్టేట్‌మెంట్

నేనే కారణం.. రష్మిక స్టేట్‌మెంట్

ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికరంగా స్పందించింది. నితిన్ పెళ్ళికి తానే కారణం అని చెబుతోంది ఈ క్రేజీ బ్యూటీ. "కంగ్రాచ్యులేషన్స్ నితిన్ సార్.. చూడండి, నేను మీకు ఎంత అదృష్టం తీసుకోచ్చానో! మీరు నాతో నటిస్తున్నారో లేదో ఓ ఇంటివారు కాబోతున్నారు. మీ ఇద్దరూ పెళ్లితో ఒక్కటవుతుండడం చాలా సంతోషంగా ఉంది'' అని ట్వీట్ చేసింది రష్మిక మందన్న.

నితిన్- రష్మిక మందన్న జోడీ రెడీ అయ్యారు

నితిన్- రష్మిక మందన్న జోడీ రెడీ అయ్యారు

ప్రస్తుతం నితిన్- రష్మిక మందన్న జోడీగా 'భీష్మ' అనే చిత్రం రూపొందుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ చేసుకొని ఫిబ్రవరి 21న విడుదలకు సిద్దమైంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తి రేకెత్తించి భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

Recommended Video

Nithiin Shalini Engagement Pictures | Nithiin Shalini Marriage In April | Filmibeat Telugu

రష్మిక జోష్.. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్

మరోవైపు రష్మిక.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలోనూ నటిస్తోంది. దీంతో పాటు తమిళ ఇండస్ట్రీని కూడా టచ్ చేయబోతోంది ఈ క్రేజీ బ్యూటీ. ప్రస్తుతం ఆమె జోష్ చూస్తుంటే అతిత్వరలో సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ అవుతుందోమో! అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X