ఒకే రోజు మూడు సినిమాలు.. ఆ స్టార్ హీరోలతో నితిన్ సోలో ఫైట్
బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకున్న యంగ్ హీరో నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో కెరీర్ లోనే మరో బిగెస్ట్ హిట్ అందుకున్నాడు. అంతకుముందు వరకు నితిన్ వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ ఈ యువ హీరో మరో డిఫరెంట్ సినిమాతో హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. కొత్త సినిమా చెక్ ను విడుదలకు సిద్ధం చేయగా పోటీగా మరో రెండు సినిమాలు సిద్ధమయ్యాయి.

మూడు సినిమాలు అనుకుంటే..
గత ఏడాది ఫిబ్రవరి 21న భీష్మ సినిమాను విడుదల చేసిన నితిన్ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాలకే లాక్ డౌన్ మొదలైంది. లేకుండా బాక్సాఫీస్ వద్ద 50కోట్ల క్లబ్ లో చేరేది. అసలైతే గత ఏడాది నితిన్ మినిమమ్ మూడు సినిమాలను రిలీజ్ చేయాలని అనుకున్నాడు.

నితిన్ ప్లాన్ వేశాడు కానీ..
మూడు కాకపోయినా రెండు సినిమాలనైతే పక్కా రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. భీష్మ అనంతరం రంగ్ దే సినిమాతో దసరాకు రావాలని అనుకున్నాడు. ఒక విధంగా రంగ్ దే సినిమాను చేస్తూనే మరో సినిమాను కూడా పూర్తి చేసి ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నాడు. అప్పటికే అందాదున్ కథను రీమేక్ చేయాలని ఆలోచించాడు

నితిన్ తో పాటు విశాల్ కూడా
లాక్ డౌన్ దెబ్బకు నితిన్ ప్లాన్ మొత్తం మారిపోయింది. దుబాయ్ లో ప్లాన్ చేసుకున్న పెళ్లితో పాటు సినిమా ప్లాన్స్ కూడా మార్చాల్సి వచ్చింది. ఇక చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేసిన చెక్ సినిమాను ఫిబ్రవరి 19న రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వగా అదే సమయానికి తమిళ్ హితో విశాల్ చక్ర కూడా విడుదల కాబోతోంది.
Recommended Video

పోటీగా కన్నడ హీరో కూడా
ఇక కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జా కూడా పొగరు అనే సినిమాతో రాబోతున్నాడు. అతను మొదటిసారి డైరెక్ట్ గా తెలుగులో తన సినిమాని డబ్ చేస్తున్నాడు. ఆ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది. కరాబు పాట కూడా బాగా క్లిక్కయ్యింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 19న గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రమోషన్ డోస్ కూడా పెంచుతున్నారు. హీరోయిన్ గా నటించిన రష్మీక మందన్న ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రమోషన్ డోస్ పెంచింది. మరి ఈ ఫైట్ లో నితిన్ చెక్ ఎంతవరకు డామినేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











