ఘనంగా నితిన్ వివాహం.. సంప్రదాయంగా మూడు మూళ్లు వేసి.. హాజరైన వరుణ్, తేజ్, కార్తీకేయ
యువ హీరో నితిన్ వివాహం ఘనంగా జరిగింది. కోవిడ్19 నిబంధనలకు అనుగుణంగా పెళ్లిని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఆనంద క్షణాల మధ్య పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల్లో అతి ముఖ్యులైన వారు వివాహానికి హాజరయ్యారు. నితిన్ పెళ్లికి సంబంధించిన విషయాలు మరిన్నీ..
Recommended Video

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో
యువ హీరో నితిన్ పెళ్లిని ఘనంగా కుటుంబ కార్యక్రమంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి (జూలై 26వ తేదీ రాత్రి) 8.30 నిమిషాలకు ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిపించారు. ఇరు కుటుంబాల సభ్యులు ఈ పెళ్లికి హాజరయ్యారు.

వేదపండితుల మంత్రాల మధ్య
నితిన్, షాలిని నవదంపతులు సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ధగధగమెరిసిపోయారు. పక్కా హిందూ సంప్రదాయ పద్దతిలో వేద పండితుల వేద మంత్రాల నడుమ నిర్ణయించిన సుముహుర్దానికే నితిన్ షాలిని మెడలో మూడు మూళ్లు వేశారు. దాంతో నితిన్, షాలిని ఒక్కటయ్యారు.

అందంగా ముస్తాబు వేదిక
నితిన్, షాలిని పెళ్లి కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పెళ్లి వేదికను అందంగా ముస్తాబు చేయించారు. పూలు, లైటింగ్‌తో వేదిక కాంతి వంతంగా మిరుమిట్లు కొల్పేలా చేసింది. కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల మథ్య పెళ్లి వేదిక కళకళలాడింది.

సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు
అమెరికాకు చెందిన, ఎన్నారై యువతి షాలినితో ప్రేమ పెళ్లిగా జరిగిన కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలు హాజరయ్యారు. కడపటి వార్తలు అందేసరికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పెళ్లికి హాజరయ్యారు. నవదంపతులకు ఆయన దీవెనలు అందించారు.

వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ
నితిన్ పెళ్లికి హాజరైన యువ హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











