Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగానే 'చెక్' మూవీ.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు
చెస్ ఆటలో ఎంతో రాటు దెలిన ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ జైలులో చివరి దశలో ఎలా ఉంటాడు? అతనికి ఎదురైన పరిస్థితులతో ఏ విధంగా పోరాడాడు అనే.. కాన్సెప్ట్ మీద దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం చెక్. స్టోరీ లైన్ తోనే చెక్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. నితిన్ కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
చెక్ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చదరంగం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ తో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారట. నితిన్ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడు. ఇక సినిమాలో ట్విస్టులు అద్భుతంగా ఉంటాయట.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చెక్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన సెమీ బయోగ్రాఫికల్ చిత్రం అని వెల్లడించాడు. జైలు శిక్షలో చెస్ ఆడిన ఒక అమెరికన్ ఖైదీ కథ ఆధారంగా చెక్ స్క్రిప్ట్ రాశానని అతను చెప్పాడు. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. నితిన్ నెక్స్ట్ రంగ్ దే సినిమా కూడా విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం అందాదున్ రీమేక్ ను కూడా వీలైనంత త్వరగా ఇదే ఏడాది రిలీజ్ చేయాలని నితిన్ ప్లాన్ చేసుకుంటున్నాడు.