నితిన్- వెంకీ అట్లూరి మూవీ టైటిల్ ఫిక్స్.. భలే కలర్‌ఫుల్‌గా ఉందే!
గతేడాది కాస్త స్లో అయిన యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరం వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. వరుసపెట్టి మూడు సినిమాలను లైన్‌లో పెట్టేసి మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' చేస్తున్న ఈ యంగ్ హీరో.. మొన్న జూన్ 23 వ తేదీన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను మొదలు పెట్టేశాడు. అదే వరుసలో తాజాగా మూడో సినిమా అప్‌డేట్ కూడా రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు నితిన్.
హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ వెంకీ అట్లూరి కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'రంగ్ దే' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. 'గివ్ మీ సమ్ లవ్' అనేది ఉపశీర్షిక. తాజాగా అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు నితిన్. ఈ సినిమా నితిన్ కెరీర్‌లో 29 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గతంలో తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరి 'రంగ్ దే' కోసం ఆసక్తికర కథాంశం రెడీ చేసుకున్నారట. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. 2020 వేసవిలో 'రంగ్ దే' ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేస్తుండటం విశేషం.
మరోవైపు ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న నితిన్- చంద్రశేఖర్ యేలేటి సినిమా త్వరత్వరగా షూటింగ్ జరుపుకోనుందట. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి మూడు సినిమాలతో ఈ ఏడాది నితిన్ జోష్ మాములుగా ఉండదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











