నితిన్, షాలిని కల్యాణ వైభోగం.. ముచ్చటేస్తున్న జంట.. నవదంపతుల ఫోటోలు వైరల్
టాలీవుడ్ యువ హీరో నితిన్ ఎన్నో అవాంతరాలను ఎదురించి తన ఇష్టసఖి శాలినిని వివాహం చేసుకొన్నారు. ఆదివారం జూలై 26 తేదీన హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు అతిముఖ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ పెళ్లికి సంబంధించిన మధురమైన క్షణాలు ఫోటోల రూపంలో..
Recommended Video

నవ దంపతులుగా నితిన్, షాలిని
యువ హీరో నితిన్, శాలిని పెళ్లి తర్వాత ఒక్కటై కెమెరా ముందుకు వచ్చి ఫోటోకు ఫోజిచ్చారు. నవ దంపతుల ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

పూలదండలు మార్చుకొని..
వివాహం అనంతరం పూలదండలు మార్చుకొంటున్న నితిన్, షాలిని. వీరి పెళ్లి కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను జిగేల్ మనిపించేలా ముస్తాబు చేశారు.

హిందూ సాంప్రదాయ పద్దతుల్లో
అంగరంగవైభవంగా జరిగిన కార్యక్రమంలో షాలినిని నితిన్ హిందూ సంప్రదాయ పద్దతుల్లో వివాహం చేసుకొన్నారు. అనంతరం ఫోటోకు ఫోజిస్తూ..

అక్షింతల మధ్య తడిసి ముద్దవుతున్న
నెత్తిన తలంబ్రాల వర్షం నితిన్ కురిపిస్తుండగా మంగళ అక్షింతల మధ్య తడిసి ముద్దవుతున్న షాలిని

సన్నిహితులతో నితిన్
పెళ్లికొడుకుగా ముస్తాబైన తర్వాత సినీ సన్నిహితులతో నితిన్

పెళ్లికి హాజరైన యువ హీరో
పెళ్లికి హాజరైన కార్తికేయ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తదితరులు


Click it and Unblock the Notifications











