జోష్‌గా నితిన్ పెళ్లి వేడుకలు.. జోరుగా మెహందీ వేడుక.. హాజరైన సినీ ప్రముఖులు ఎవరంటే..
టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి ముహుర్తం రెండు రోజులున్న సమయంలో పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలను, థిమ్ సెలబ్రేషన్‌కు తెర తీశారు. తాజాగా నితిన్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను టాలీవుడ్ డిజైనర్ నీరజ కోన తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలో నితిన్ పెళ్లికి సంబంధించిన వివరాలు మరినీ మీ కోసం

కట్టుదిట్టమైన జాగ్రత్తలతో పెళ్లి
కోవిడ్ 19 పరిస్థితుల కారణంగా నితిన్ పెళ్లిని అత్యంత భారీ కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య కుటుంబ కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించారు. జూలై 26వ తేదీ రాత్రి 8.30 నిమిషాలకు హైదరాబాద్‌లోని ప్రఖ్యాత హోటల్ తాజ్ ఫలక్‌నుమాలో వివాహాం జరుగనున్నది. ఇప్పటికే ఇరు కుటుంబాలు ఫలక్‌నుమా ఫ్యాలెస్‌కు చేరుకొన్నారు.

గురువారం రాత్రి మెహందీ సెలబ్రేషన్
నితిన్ పెళ్లిలో భాగంగా పలు కార్యక్రమాలను కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి ఇరు కుటుంబాలు మెహందీ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఫ్యామిలీ సభ్యులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిజైనర్ నీరజ కోనతో పాటు కొందరు సినీ ప్రముఖులు హాజరైనట్టు తెలిసింది.

సంగీత్ కార్యక్రమంలో
ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో నితిన్ సన్నిహితులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన యువ హీరోలు కూడా హాజరుకానున్నట్టు సమాచారం. ఈ వేడుకను ఉత్సాహం, జోష్‌ను కలిపి నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.

సీఎం కేసీఆర్, పవన్ కల్యాణ్‌కు
నితిన్ తన పెళ్లికి చాలా మంది సినీ, రాజకీయ, వ్యాపారవర్గాలను ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను నితిన్ స్వయంగా ప్రగతి భవన్‌కు వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. సినీ పరిశ్రమలో ప్రముఖులు పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీ, త్రివిక్రమ్, దిల్ రాజు, ఇతర హీరోలకు ఆహ్వాన పత్రికలు అందజేసినట్టు సమాచారం.

నితిన్ పెళ్లికి పవన్ హాజరు
నితిన్ పెళ్లికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరవుతున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్ అంటే నితిన్‌కు మాటల్లో చెప్పలేనంత ఇష్టం అనే సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సందర్భంగా నితిన్ పెళ్లికి హాజరవుతున్నట్టు పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించినట్టు ఓ వార్త మీడియాలో వైరల్‌గా మారింది.
Recommended Video

డెస్టినేషన్ వెడ్డింగ్ క్యాన్సిల్
అమెరికాకు చెందిన యువతి షాలినితో ఐదేళ్లుగా నితిన్ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వారి పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్‌గా దుబాయ్‌లో చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 15వ తేదీన వివాహం, ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దుబాయ్‌లో జరిగే డిస్టినేషన్ వెడ్డింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











