చెక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్: ముఖ్య అతిథులుగా ఎస్ఎస్ రాజమౌళి, వరుణ్ తేజ్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద ప్రసాద్ నిర్మాతగా నితిన్, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చెక్. ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. ఈ చిత్రం ఫిబ్రవరి 26 తేదీన రిలీజ్‌కు సిద్ధమై ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా జరుపుకొంటున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం ఫిబ్రవరి 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు సంబంధించిన తాజా వార్తల కోసం తెలుగు ఫిల్మీబీట్‌ను వీక్షించండి.
Recommended Video

1980 నుంచి నేను హీరోగా
1980 నుంచి నేను హీరోగా, నటుడిగా నా ప్రయాణం మొదలైంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిదాతో ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమాలో నా నటనకు మంచి ఆదరణ లభించింది. అదే ప్రేమను నాపై కురిపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చెక్ సినిమా కోసం దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఫోన్ చేసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఆయనను కలిసినప్పుడు నా పాత్రను బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షాతో చేయించాలని అనుకొన్నారట. కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో నాతో చేయించాలని నిర్ణయం తీసుకొన్నారు అని సాయి చంద్ తెలిపారు.

చంద్రశేఖర్ యేలేటి జెన్యూన్ డైరెక్టర్
చెక్ మూవీ అతి పెద్ద హిట్ సాధిస్తుంది. ప్రేక్షకుల అభిరుచి మారింది. విభిన్నమైన చిత్రాలను కోరుకొంటున్నారు. నితిన్ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. చంద్రశేఖర్ యూనిక్ డైరెక్టర్. జెన్యూన్ డైరెక్టర్ మీరు. ట్రైలర్ చూస్తే పెద్ద హిట్టు కొట్టబోతున్నట్టు అర్ధమైంది. కల్యాణీ మాలిక్ రీరికార్డింగ్ బాగుంది. అభిరుచి కల నిర్మాత వీ ఆనంద్ ప్రసాద్. ఆయనకు మంచి హిట్ రావాలని కోరుకొంటున్నాను అని క్రాక్ దర్శకుడు గొపిచంద్ మలినేని అన్నారు.

నితిన్‌కు భీష్మ కంటే పెద్ద హిట్: మిర్చి సంపత్
నా కెరీర్‌లో ఎంతో మంది డైరెక్టర్లు, అసిసెంట్ డైరెక్టర్లతో పనిచేశాను. చంద్రశేఖర్ యేలేటి గురించి చాలా మంది వద్ద విన్నాను. ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అది మీకు తెలియకపోవచ్చు. మీరు ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు మీరు ఇన్స్‌పిరేషన్. చెక్ విషయానికి వస్తే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నితిన్‌కు భీష్మ కంటే పెద్ద సక్సెస్ లభిస్తుంది. భవ్య క్రియేషన్స్ నాకు ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటింది. నిర్మాత ఆనంద్ ప్రసాద్ చాలా సింపుల్‌గా ఉంటారు. లౌక్యం కంటే పెద్ద హిట్ అవుతుంది అని మిర్చి సంపత్ అన్నారు.

రాజమౌళి, వరుణ్ తేజ్‌కు ధన్యవాదాలు
చెక్ మూవీ ప్రీరిలీజ్ వేడుకకు వచ్చిన గొపిచంద్ మలినేని, భీష్మ డైరెక్టర్ వెంకి కుడుముల, సంపత్ థ్యాంక్స్. ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన వరుణ్ తేజ్, ఎస్ఎస్ రాజమౌళికి ధన్యవాదాలు. చివరి నిమిషంలో ఆహ్వానించినప్పటికి, ఆయన తన ముఖ్యమైన పనులను వదులుకొని ఈ వేడుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నితిన్ ఫ్యాన్స్‌కు ఒక్కటే చెప్పదలచుకొన్నాను. చెక్ సినిమా ఎవరినీ నిరాశ పరచదు. చెక్ సినిమా అందరూ చూడాలని కోరుకొంటున్నాను అని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి అన్నారు.

మా డైరెక్టర్ గొప్పతనం: నిర్మాత ఆనంద ప్రసాద్
ఓ పిట్టకథ, మిడిల్ క్లాస్ మెలోడిస్ విజయాల తర్వాత మేము చెక్ సినిమాతో ముందుకు వస్తున్నాం. నాకు ఇష్టమైన డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి, యూత్‌ఫుల్ హీరో నితిన్ కాంబినేషన్‌లో చెక్ మూవీని నిర్మించాం. ఇది మాకు గొప్ప కాంబినేషన్. నితిన్ ఎప్పటికీ గుర్తుంచుకొనే చిత్రంగా చెక్ మిగిలిపోతుంది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్‌ను ఇంతకు ముందు చేయలేదు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నితిన్ విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రంలో నటులు కాకుండా క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తాయి. అది మా డైరెక్టర్ గొప్పతనం.

భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల..
భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల.. నితిన్ గురించి మాట్లాడుతూ.. కిందా పైనా ఊపు మా నితిన్ అన్న తోపు. ఇది నేను సరదాగా చెప్పడం లేదు. నా మనసులో ఉన్నదే. ఎందుకంటే నాకు ఆయన ఎప్పుడూ తోపే. ఎవరైనా మన లైఫ్ లో మనల్ని నమ్మి మనకు సపోర్ట్ చేస్తే ఎల్లప్పుడు తోపే. ఇక టైగర్ కు టైమొచ్చింది అన్నట్లు 2020 నుంచి నితిన్ అన్న టైమ్ స్టార్ట్ అయ్యింది. హిట్టు కొట్టారు. కోవిడ్ టైమ్ లోనే పెళ్లితో పాటు అన్ని సెలబ్రేషన్స్ హ్యాపీగా చేసుకున్నారు. అప్పుడు కోవిడ్ కాదు కదా కోల్డ్ కూడా రాలేదు. అందుకే నితిన్ అన్న టైమొచ్చింది.. అని వివరణ ఇచ్చారు.

ఎన్నో టేకులు తిన్నాను.. నితిన్
చంద్రశేఖర్ యేలేటి లాంటి దర్శకుడితో చెక్ సినిమా చేయడం లక్కీగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా యాక్టింగ్ ఒక లెక్క.. చెక్ తర్వాత మరో లెక్క. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ చెక్ సినిమా షూటింగులో ఎన్నో టేకులు తీసుకొన్నాను. నాకు డిఫరెంట్ యాక్టింగ్‌ను చంద్రశేఖర్ యేలేటి నేర్పించారు. చెక్ సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి మనకు మంచి పేరు వస్తుందని చెబితే.. నాకు పేరు వద్దు.. డబ్బులు రావాలని కోరుకొంటున్నానని చంద్రశేఖర్ యేలేటి చెప్పారు. కల్యాణీ మాలిక్ ఈ చిత్రానికి బిగ్గెస్ట్ పిల్లర్. మేము 50 శాతం పనిచేస్తే మీరు మరో లెవెల్‌కు తీసుకెళ్లారు అని అన్నారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి గారి గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైమ్ ఆయన గురించి మాట్లాడే అవకాశం దొరికింది. చిన్నప్పుడు నుంచి ఆయన సినిమాలు చేస్తూ పెరిగాము. అందరికి డ్రీమ్ బిగ్ అనేది చూపించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు.. అని చెప్పారు.
ఇక నితిన్ గురించి చెప్పాలి అంటే.. తను నాకు మంచి ఫ్రెండ్. జనరల్ గా పెళ్ళైన తరువాత కొంచెం స్లో అవుతారు. కానీ నితిన్ వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టి మాకు చెక్ పెట్టాడు. నితిన్ ట్రాఫిక్ ఎక్కువ చేశాడు అని వరుణ్ సరదాగా మాట్లాడారు. నితిన్ మొదటి నుంచి కూడా చాలా కమిటెడ్ గా ఉన్నాడు. సినిమా తప్పకుండా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను..అని వరుణ్ తెలిపారు
చంద్రశేఖర్ యేలేటి గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే చాలా ఆసక్తిగా ఉండేది. యూత్ లో ఆయన సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక నమ్మకం కూడా ఉంది. చెక్ అనే సినిమా కూడా ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. క్రాక్ సినిమాతో ఈ ఏడాది టాలీవుడ్ కు మంచి ఓపెనింగ్స్ ఇచ్చిన ఆడియెన్స్ కు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అదే విధంగా చెక్ సినిమాకు కూడా మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను.. అని వరుణ్ తేజ్ మాట్లాడారు.

ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ.
ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు సెకండ్ హోమ్ లాంటిది. ఆడియెన్స్ నుంచి వస్తున్న సపోర్ట్ నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ సినిమా నాకు బెస్ట్ లాంచ్ లాంటిదని చెప్పవచ్చు. నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ చంద్రశేఖర్ గారు కూడా చాలా పాజిటివ్ గా ఉంటారు. నితిన్ తో నటించడం కూడా నాకు ఒక మంచి అనుభవం. చాలా మంచి కో స్టార్. రాజమౌళి, వరుణ్ తేజ్ గారు ఈ వేడుకకు వచ్చి సపోర్ట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద స్టార్స్ తో స్టేజ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ డ్రీమ్ ఈ రోజు నిజమయ్యింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక మేము చెక్ సినిమా ద్వారా ఫిబ్రవరి 26న మీ ముందుకు రాబోతున్నాము. తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుంది. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.. అని ప్రియా ప్రకాష్ వారియర్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











