Check Movie Twitter Review: అందరూ ఆయన గురించే.. నితిన్ కెరీర్‌కు మాత్రం.. సినిమాకు ప్లస్ మైనస్ ఇవే!

కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు యంగ్ హీరో నితిన్. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇష్క్' మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అప్పటి నుంచి హిట్లు, ఫ్లాపులతో సాగిపోతున్నాడు. ఇక, గత ఏడాది 'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్న నితిన్.. ఆ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో 'చెక్' మూవీ ఒకటి. శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా 'చెక్' ట్విట్టర్ రివ్యూ మీకోసం!

విలక్షణ దర్శకుడితో జోడీ కట్టిన నితిన్

విలక్షణ దర్శకుడితో జోడీ కట్టిన నితిన్

'భీష్మ' వంటి భారీ హిట్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న చిత్రం 'చెక్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇందులో నితిన్ చెస్ ప్లేయర్‌గా నటించాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

ట్రైలర్‌తోనే అంచనాలు... భారీ బిజినెస్

ట్రైలర్‌తోనే అంచనాలు... భారీ బిజినెస్

'చెక్' మూవీని ప్రారంభంలో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఎప్పుడైతే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయో అప్పటి నుంచి దీనిపై అంచనాలు పెరిగాయి. అప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కారణంగానే 'చెక్' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది. దీంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.

 భారీగా విడుదల.. ఓవర్సీస్‌లో ముందే

భారీగా విడుదల.. ఓవర్సీస్‌లో ముందే

నితిన్ నటించిన 'చెక్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500లకు పైగా థియేటర్లలో విడుదల అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 8.30 గంటలకు షోలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల బెన్‌ఫిట్ షోలు కూడా వేసేశారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీమియర్ షోలు పూర్తయినట్లు తెలుస్తోంది.

వాళ్లు సినిమా ఎలా ఉందంటున్నారు?

వాళ్లు సినిమా ఎలా ఉందంటున్నారు?

'చెక్' మూవీని ప్రీమియర్ షోలు, స్పెషల్ షోల ద్వారా చాలా మంది ఇప్పటికే చూసేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ఈ మూవీపై తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం.. ఈ సినిమాకు మిశ్రమ స్పందనే వస్తోంది. పలువురు ఈ సినిమా సూపర్ హిట్ అంటుంటే.. కొందరు మాత్రం ఏవరేజ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు.

అందరూ ఆయన గురించే చెబుతున్నారు

అందరూ ఆయన గురించే చెబుతున్నారు

'చెక్' సినిమా ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటి నుంచో డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి గురించి మాట్లాడడం ప్రారంభించారు. అందుకు అనుగుణంగానే ట్రైలర్‌ను ఆసక్తికరంగా చూపించి.. సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక, మూవీలో కూడా చందూ దర్శకత్వ ప్రతిభ స్పష్టంగా కనిపించిందట. ఆయన స్టోరీ నేరేషన్, స్క్రీన్‌ప్లే అదరగొట్టేశాడని సినిమాను చూసిన వాళ్లందరూ చెబుతున్నారు.

రిజల్ట్ ఎలా ఉన్న నితిన్ కెరీర్‌కు మాత్రం

రిజల్ట్ ఎలా ఉన్న నితిన్ కెరీర్‌కు మాత్రం

ఇక, ఈ సినిమాలో హీరో నితిన్ అదరగొట్టేశాడని ప్రేక్షకులంతా అంటున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని సున్నితమైన సన్నివేశాల్లో అతడు ఎంతో పరిణితితో నటించాడని చెబుతున్నారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నటుడిగా నితిన్‌కు మంచి మార్కులు రావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఇక, రకుల్, ప్రియా ప్రకాశ్, సంపత్‌లు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారట.

సినిమాకు ప్లస్ మైనస్ ఇవేనంటున్నారు

సినిమాకు ప్లస్ మైనస్ ఇవేనంటున్నారు

'చెక్' మూవీని చూసిన చాలా మంది ట్విట్టర్ ద్వారా రివ్యూను ఇచ్చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం.. ఈ సినిమాలో కథ, డైరెక్టర్ పనితీరు, నితిన్ యాక్టింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్, ట్విస్టులు హైలైట్‌గా ఉన్నాయని అంటున్నారు. అలాగే, ఫస్టాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్స్, ఎడిటింగ్, సెకెండాఫ్‌లో స్క్రీన్‌ప్లే నిరాశ పరిచాయని చెబుతున్నారు. మొత్తానికి అందరూ కలిసి చూసే సినిమా అని అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X