నితిన్ ఓవర్ చేశాడా? స్టేజీపైనే ఎమోషనల్, దర్శకుడికి ముద్దు..
Recommended Video

'శ్రీనివాస కళ్యాణం' సినిమా ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్.... ప్రీ రిలీజ్ పంక్షన్లో ఎమోషనల్ అయ్యాడు. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను అనే ఆనందంలో ఆయన స్టేజీపై మాట్లాడే క్రమంలో కాస్త అయోమయానికి గురయ్యాడు. ఆ ఆనందంలో దర్శకుడు సతీష్ వేగేశ్నకు ముద్దు పెట్టబోయాడు. నితిన్ చేసిన పని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నవ్వులు పూయించింది.

నా కెరీర్లో నెం.1 అయ్యేట్లు ఉంది
సినిమా గురించి ఆడియో పంక్షన్లో చాలా చెప్పాను. ఈ మూవీ ఎప్పటికైనా నా కెరీర్లో టాప్ 5లో ఉంటుందనుకున్నాను. కానీ ఇపుడు అలా లేదు... టాప్ 1లో ఉండేట్లు ఉంది. సినిమా విడుదల ముందే ఈ చిత్రానికి అంత మంచి రెస్పాన్స్ వస్తోంది... అని నితిన్ తెలిపారు.

నాకే ఓవరాక్షన్ అనిపించింది
ఆ రోజు ఆడియో ఫంక్షన్లో చాలా డైలాగులు మాట్లాడాను. తర్వాత నేను మాట్లాడింది గుర్తు చేసుకుంటే భయం వేసింది. ఏంటి ఇంత మాట్లాడాను, ఓవరాక్షన్ అయింది అనిపించింది. తర్వాత వారమే సినిమా చూశాను... అపుడు నేను మాట్లాడింది నిజమే అని రియలైజ్ అయ్యాను అని నితిన్ తెలిపారు.

నాతో పాటు అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి
సినిమా చూస్తుంటే నా కళ్లలో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. సినిమా అయిపోయిన తర్వాత కూడా వాటర్ కారుతూనే ఉంది. నా సినిమా కాబట్టి నాకు ఎక్కువ ప్రేమ ఉండి అలా జరుగుతుందనుకున్నాను. తర్వాత డిస్ట్రిబ్యూటర్ల, నాతో నటించిన వారి కళ్లలో కూడా ఆనంద భాష్పాలు కనిపించాయి.

వెంటనే దిల్ రాజకు ఫోన్ చేశాను
సినిమా చూసిన వెంటనే మా అంకుల్ దిల్ రాజుకు ఫోన్ చేశాను. మీ బేనర్లో బెస్ట్ హిట్ అని చెప్పేశాను. ఈ రోజు సినిమా కొన్న బయ్యర్లు కూడా అదే చెప్పారు. ఇలాంటి మంచి సినిమాలో నేను నటించినందుకు చాలా సంతోషంగా ఉంది.

లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే మూవీ
ఈ సినిమా విషయంలో సమీర్ రెడ్డి గారికి స్పెషల్ థాంక్స్. 60 రోజుల్లో 70 మంది ఆర్టిస్టులతో ఇంత క్వాలిటీగా చేశారు. అందరు ఆర్టిస్టులకు స్పెషల్ థాంక్స్. ఇది ఆడియన్స్‌కు లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే సినిమా అవుతుంది.

దర్శకుడికి ముద్దు...
తన ప్రసంగం ముగిసిన అనంతరం దర్శకుడు సతీష్ వేగేశ్నకు హగ్ ఇచ్చిన నితిన్.... మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలని ఉందంటూ కిస్ చేసే ప్రయత్నం చేయడం అందరినీ నవ్వించింది.


Click it and Unblock the Notifications











