వర్మ దర్శకత్వంలో నితిన్!!

వాస్తవానికి రామ్‌గోపాల్ వర్మ 'రణ్' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మీడియాలో నెలకొన్న అవాంఛనీయ పోటీని చూపించే కథతో 'రణ్' కథ సిద్ధమైంది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రను పోషిస్తారని చెప్పారు. అయితే అమితాబ్ కాల్షీట్ల కోసం మరి కొద్ది నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఖాళీగా ఉండటం ఎందుకని వర్మ ఓ చిన్న చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు.
ఇక ఈ హిందీ సినిమా షూటింగ్‌ని కేవలం 35 రోజుల్లో పూర్తి చేయాలనుకొంటున్నారు. అజ్ఞాతంగా ఉంటూ మనుషుల్ని చంపే ఓ శక్తి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. అలా చంపుతున్నది జంతువా? మనిషా? ఏదైనా ప్రేతాత్మ? అన్నది సస్పెన్స్. భారీగా స్పెషల్ ఎఫెక్ట్స్‌తో దీన్ని తీర్చిదిద్దాలనుకొంటున్నారు. వర్మ సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్కువ మోతాదులో ఉండే చిత్రం ఇదే కావచ్చు. ఇక ఈ చిత్రంలో అవకాశం రావటం నితిన్ అదృష్టంగా అంతా చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











