ఏంటీ స్పీడు.. వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తోన్న నితిన్!!

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఓ వైపు భీష్మ చిత్రం సూపర్ హిట్ అయింది. మరో వైపు రంగ్ దే చిత్రం రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ భారీ అంచనాలనే పెంచేసింది. ఇక ఈ మధ్యే బాలీవుడ్ మూవీ అంధాదున్ రీమేక్‌కు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. అది కూడా నవంబర్‌లో షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో మరో చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను కూడా ఇచ్చాడు.

మామూలుగా కరోనా రాకపోయి ఉంటే నితిన్ ఈ ఏడాది దాదాపు మూడు నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించేవాడు. అయితే కరోనా వచ్చి అన్నింటిని మార్చేసింది. దీంతో దాదాపు ఏడు నెలలు షూటింగ్ లేకుండా గడపాల్సి వచ్చింది. అందుకే ఇకపై ఆలస్యం చేయకుండా చకచకా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది. ఈక్రమంలోనే తన తదుపరి చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను ప్రకటించేశాడు.

nithin And Chandra sekhar Yeleti Project Update On 1st october

భవ్య క్రియేషన్స్‌పై తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను రేపు(అక్టోబర్ 1) సాయంత్రం 4 30 గంటలకు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ 12 వ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తారని, నితిన్ హీరోగా నటిస్తారని రేపు అసలైన అప్డేట్ ఉంటుందని ఓ పోస్టర్‌ను వదిలారు. మొత్తానికి నితిన్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X