For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ఇమేజ్ ని వాడటంపై నితిన్ వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : నితిన్ తన చిత్రాల ప్రమోసన్ కోసం పవన్ కల్యాణ్ ని తన చిత్రాల్లో వాడుతున్నారంటూ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజైన చిన్నదాన నీ కోసం చిత్రంలో సైతం పవన్ ...బద్రి చిత్రం ఫుటేజ్ ని వాడారు.. అయితే ఇది తమ చిత్రం ప్రమేషన్ కాదని తాను పవన్ కి వీరాభిమానని కాబట్టే అలా చేసానంటున్నారు నితిన్.

    https://www.facebook.com/TeluguFilmibeat

    నితిన్ మాట్లాడుతూ... " నేను చిన్నప్పటి నుంచీ పవన్ కి వీరాభిమానని. తొలి ప్రేమ చిత్రం నేను హీరోని కావటానికి ప్రేరేపించింది. మొదటి నుంచీ నా చిత్రాల్లో పవన్ కళ్యాణ్ ఫొటోగాని, డైలాగు కానీ ఎక్కడో చోట పెడుతూ వస్తున్నాను. అదే అభిమానంతో కూడిన ట్రెండ్ ని ఇష్క్ తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నాను. అయితే జనం, మీడియా పవన్ నా ఇష్క్ చిత్రం ఆడియో లాంచ్ కు వచ్చినప్పటినుంచీ గుర్తిస్తున్నారు ," అన్నారు నితిన్.

    Nithin Clarifies on 'Using' Pawan Kalyan

    అలాగే పవన్ ఛర్మిష్మాని బ్యాంకింగ్ గా నితిన్ వాడుతున్నాడనే విషయమై మాట్లాడుతూ..."నేను పది ఫ్లాపుల తర్వాత ఇష్క్ తో విజయం సాధించాను...నేను అప్పుడు పవన్ ని మరిస్తే...అదే జనం, మీడియా... నేను పవన్ ని మరిచిపోయానంటూ బ్లేమ్ చేస్తారు. అదే నేను అదే ట్రెండ్ ని కొనసాగిస్తే... నేను ఆయన్ను వాడుకున్నానంటారు. కాబట్టి నేను అవేమీ పట్టించుకోకుండా నా మనస్సు ఏది చెప్తే అదే చేస్తున్నా..అదే ...ఆయన ఆరాధించటం ." అన్నారు నితిన్.

    చిన్నదాన నీ కోసం కథ...

    పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని అయిన నితిన్(నితిన్) చేసిన ఓ ఫైట్ లాంటి మంచిపనివల్ల సిటీలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ రెడ్డిగారు(నాజర్) అభిమానం పొందుతాడు. మరోప్రక్క గర్ల్ ప్రెండ్ కోసం అన్వేషిస్తున్న నితిన్ కి నందిని(మిస్తి చక్రవర్తి)కనపడుతుంది. ఆమెను ఫాలో అయ్యి ప్రేమలో పడేద్దామనుకుంటే...ఆమె ...రెడ్డిగారితో సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తూంటుంది. తన వెనక నితిన్ పడుతున్నాడని అర్దం చేసుకున్న నందిని అతనికి, రెడ్డి గారికి ఉన్న చనువుని వాడేసుకుని ఆయనతో రిలేషన్ షిప్ పెంచుకుంటుంది. అంతేకాకుండా ఓ రోజు రెడ్డి గారిని తీసుకుని బర్సెలోనా వెల్లిపోతుంది. అసలు రెడ్డిగారికి, నందిని కు ఉన్న రిలేషన్ ఏమిటి..ఆయనతో ఎందుకు సాన్నిహిత్యం సంపాదించుకోవాలనుకుంది...నందిని ప్రేమని ఎలా నితిన్ పొందాడు అన్న విషయం తెలియాలంటే మిగతా కథ తెరపై చూడాల్సిందే.

    శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ హీరోయిన్ మిస్తీ జోడి కట్టింది. ఈ చిత్రంలో ఆలీ, నరేశ్‌, సితార, మధునందన్‌ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

    English summary
    Nitin Said "Right from childhood, I'm a great fan of Pawan Kalyan. In fact, Tholi Prema is what inspired me to become a hero. Since my debut into films, almost all my films have references to Pawan Kalyan be it his photo or his films somewhere in between the films. And I'm continuing the same trend even after Ishq as a gratitude to my star. But people and media have started recognising this especially after Ishq as Pawan attended the audio launch of the film," said Nithin.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X