నితిన్‌పై దొంగతనం నింద, బంధించిన సింహాచలం అర్చకులు.. అసలేం జరిగిందంటే!

Recommended Video

Nithin Visits Simhachalam Temple for Chal Mohan Ranga Movie

ఛల్ మోహన్ రంగ ప్రమోషన్ నిమిత్తం హీరో నితిన్ ఆదివారం వైజాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రమోషన్ కార్యక్రమాల్లోపాల్గొన్న అనంతరం నితిన్ సింహాచలం వెళ్లి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నాడు. సినిమా విడుదల నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం నితిన్ ఆలయానికి వెళితే వింత అనుభవం ఎదురైంది. ఆలయంలో స్వామివారి ఉంగరం పోయిందని, ఆ సమయంలో నితిన్ అక్కడ ఉండడంతో అతడిపై నింద వేశారు. దీనితో నితిన్ బిత్తరపోయాడు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో నితిన్ కు ఊరట లభించింది.

జోరుగా ఛల్ మోహన్ రంగ ప్రమోషన్స్

జోరుగా ఛల్ మోహన్ రంగ ప్రమోషన్స్

ఛల్ మోహన్ రంగ చిత్రం ఏప్రిల్ 5 న విడుదలకు సిద్ధం అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ అంతా ప్రచారం కోసం వైజాగ్ వెళ్లారు. ఛల్ మోహన్ రంగ చిత్రం నితిన్ కెరీర్ లో 25 వ చిత్రంగా రూపొందుతోంది.

పవన్, త్రివిక్రమ్ నిర్మాణంలో

పవన్, త్రివిక్రమ్ నిర్మాణంలో

ఛల్ మోహన్ రంగ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మూల కథని అందించారు. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు.

మేఘాతో రెండవసారి

మేఘాతో రెండవసారి

ఈ చిత్రంలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. లై చిత్రం తరువాత నితిన్, మేఘా వరుసగా రెండవ సారి నటిస్తోంది. లై చిత్రంలో నితిన్, మేఘా మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.

సింహాచలంలో సందడి

సింహాచలంలో సందడి

వైజాగ్ లో ప్రమోషన్ కార్యక్రమాలని ముగించుకున్నా తర్వాత నితిన్ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సుల కోసం సింహాచలం ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకునే సందర్భంలో నితిన్ కు వింత అనుభవం ఎదురైంది.

ఉంగరం దొంగిలించాడంటూ నింద

ఉంగరం దొంగిలించాడంటూ నింద

ఆలయంలో లక్ష్మి నరసింహ స్వామి వారి ఉంగరం పోయిందని, నితిన్ దొంగిలించాడంటూ ఆలయ అర్చకులు అతడిపై నింద వేశారు. దీనితో నితిన్ ఖంగారు పడిపోయాడు. తాను తీయలేదని కావాలంటే చెక్ చేసుకోండి అంటూ నితిన్ కోరాడు.

తాళ్లతో బంధించారు

తాళ్లతో బంధించారు

తాను ఉంగరం తీయలేదని నితిన్ చెబుతున్నా అర్చకులు బంధించారు. హీరోగా మంచి పేరు సంపాదించిన మీరు స్వామివారి ఉంగరం దొంగిలించడం ఏంటి.. మర్యాదగా ఆ ఉంగరాన్ని ఇచ్చేయండి అంటూ అంటూ అర్చకులు నితిన్ ని నిలదీశారు. నేను తీయలేదు మొర్రో అంటున్నావినిపించుకోలేదు. అనుమానం ఉన్న మరి కొంత మందిని కూడా అర్చకులు బంధించి ఎక్కడకి కదలడానికి వీల్లేదని ఆదేశించారు.

బయట ఉన్న వారు నవ్వుతూ

బయట ఉన్న వారు నవ్వుతూ

బయట ఉన్న భక్తులంతా ఈ తతంగాన్ని నవ్వుతూ వీక్షించారు. నితిన్ తో సహా బందీలుగా ఉన్న వారంతా ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడుతూ కనిపించారు.

 అసలు విషయం చెప్పారు..నితిన్ సేఫ్

అసలు విషయం చెప్పారు..నితిన్ సేఫ్

ఆలయ అర్చకులు ఎట్టకేలకు ఉంగరం దొరికిందని ప్రకటించడంతో బందీలుగా ఉన్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. అర్చకులు అసలు విషయం చెప్పడంతో నితిన్ సహా బందీలుగా ఉన్నా వారు ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. అసలు అక్కడ దొంగతనమే జరగలేదు. ప్రతి ఏడాది స్వామివారికి సింహాద్రి అప్పన్న కల్యాణ ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు వినోద ఉత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగానే స్వామివారి ఉంగరం పోయిందంటూ కొంత మంది భక్తులని ఆటపట్టిస్తారు. ప్రతి ఏడాది జరిగే ఈ తంతులో ఈ సారి నితిన్ కూడా భాగమయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X