మమ్మీ టెన్షన్ పడకు.. తప్పకుండా పెళ్లి చేసుకుంటా, పెళ్ళికి భయపడింది అందుకే.. నితిన్!
Recommended Video

యంగ్ హీరో నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో విడుదలకు ముందే పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది. సాంప్రదాయ వివాహ ప్రాముఖ్యతని తెలియజేసేలా ఈ చిత్రం ఉండబోతుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 9 న విడుదల కాబోతున్న ఈ చిత్ర ఆడియో వేడుక ఆదివారం రోజు ఘనంగా జరిగింది. నితిన్, రాశి ఖన్నా ఈ చిత్రంలో జంటగా నటించారు. ఆడియో వేడుకలో నితిన్ మాట్లాడుతూ.. తన వివాహం గురించి ఓపెన్ అయ్యాడు.

ఇంట్లో చావగొడుతున్నారు
నితిన్ ప్రసంగిస్తూ.. గత కొన్నేళ్లుగా మా ఇంట్లో పెళ్లి చేసుకోమని చావగొడుతున్నారు. ఇప్పుడే కాదు ఇంకొంత కలం ఆగి చేసుకుంటా అని సర్ది చెబుతూ వచ్చాను. కానీ చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న శ్రీనివాస కళ్యాణం చిత్ర కథ చెప్పిన తరువాత వెంటనే కనెక్ట్ అయిపోయా. పెళ్లి చేసుకుంటే ఇలాగే చేసుకోవాలని అనిపించింది.

పెళ్లంటే భయం వేసింది
షూటింగ్ మొదలయ్యాక పెళ్ళికి సంబందించిన ఆ పూజలు, వ్రతాలు చూసి పెళ్లంటే భయం వేసిందని నితిన్ సరదాగా వ్యాఖ్యానించాడు. మమ్మీ టెన్షన్ పడకు.. తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని తన తల్లికి తెలిపాడు.

టాప్ 3 లో ఆ సాంగ్
తన అ.. ఆ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. ఆ ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస కళ్యాణం చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించాడు అంటూ నితిన్ మిక్కీని ప్రశంసించాడు. ఈ చిత్రంలో కళ్యాణం వైభోగం సాంగ్ తన టాప్ 3 సాంగ్స్ లో ఒకటిగా ఉంటుందని తెలిపాడు.

ఇంత బిల్డప్ అవసరమా
దిల్ రాజు నిర్మాతగా ఆయన తొలి చిత్రం దిల్ లో నటించాను. అందుకే ఆయన గురించి బాగా తెలుసు. దిల్ సమయంలో తరువాతి రోజు షూటింగ్ ఉందట ఈరోజు నుంచే హడావిడి మొదలు పెట్టేవారు. ఫస్ట్ సినిమాకే ఆయనకు ఇంత బిల్డప్ అవసరమా అనిపించింది. 15 ఏళ్ల తరువాత మళ్ళీ ఆయన చిత్రంలో నటిస్తున్నా. ఇప్పుడు అర్థం అయింది. అది బిల్డప్ కాదు సినిమా పట్ల డెడికేషన్ అని నితిన్ తెలిపాడు.

నేను ముసలివాడిని అయ్యాక
తాను ముసలి వాడిని అయ్యాక నేను చేసిన గొప్ప చిత్రాలు ఏవి అని చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం చిత్రం ఒకటి, రెండు స్థానాల్లో ఉంటుందని నితిన్ ధీమా వ్యాఖ్యం చేశాడు. అంతటి అద్భుతమైన కథ సిద్ధం చేసిన దర్శకుడు సతీష్ ని ప్రశంసించాడు.


Click it and Unblock the Notifications











