యువ హీరో నితిన్ నిన్న 'ద్రొణ' సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. రామోజీ ఫిలిం సిటీ లో యూక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తూండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సన్నివేశంలో ట్యూబ్ లైట్లతో ఫైట్ చేస్తూండగా ఒక లైట్ పగిలి ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అపోలో ఆసుపత్రిలో అతన్ని చేర్చారు. అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి గాయాలు మైనర్ వేనని,కంగారు పడవలిసిందేమీ లేదని ట్రీట్ మెంట్ ఇచ్చారు.ఇక సిక్స్ పాక్ పెంచిన నితిన్ ఇప్పుడు యాక్షన్ హీరోగా మారటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ క్రమంలోనే రిస్క్ తీసుకుని డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.