»   » పవర్ స్టారే కాదు..నితిన్‌కు కమల్ హాసన్ కూడా ఫిదా..బంపర్ ఆఫర్ ఆఫర్ కొట్టేశాడు!

పవర్ స్టారే కాదు..నితిన్‌కు కమల్ హాసన్ కూడా ఫిదా..బంపర్ ఆఫర్ ఆఫర్ కొట్టేశాడు!

Subscribe to Filmibeat Telugu
Nithin Grabs a Fantanstic Oppurtunity

హీరో నితిన్ కు 2018 సంవత్సరం బాగా కలసి వచ్చేలా కనిపిస్తోంది. ఈ హీరో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లని ఒకే చేస్తూ తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు. నితిన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో వస్తున్న ఛల్ మోహన్ రంగ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. నితిన్ తన తదుపరి చిత్రంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో శ్రీనివాస కళ్యాణ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కూడా ప్రారంభం అయింది. ఇటీవల కాలంలో నితిన్ మంచి విజయాల్ని అందుకుంటున్నాడు. అతడి మార్కెట్ కూడా పెరుగుతోంది. తాజాగా నితిన్ ని మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

 పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్‌గా

పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్‌గా

నితిన్ అభిమాన హీరో పవన్ కళ్యాణ్. ఆయన నిర్మాణంలో నటించడం తన అదృష్టమని నితిన్ ఇది వరకే తెలిపాడు. ఛల్ మోహన్ రంగ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథని అందిస్తున్నారు.

ఛల్ మోహన్ రంగ పాజిటివ్ వైబ్రేషన్స్‌తో

ఛల్ మోహన్ రంగ పాజిటివ్ వైబ్రేషన్స్‌తో

ఛల్ మోహన్ రంగ చిత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విదులైన టీజర్, రెండు సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో

కృష్ణ చైతన్య దర్శకత్వంలో

లిరిసిస్ట్ కృష్ణ చైతన్య రౌడీ ఫెలో చిత్రంతో దర్శకుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛల్ మోహన్ రంగ చిత్రానికి ఇతడే దర్శకుడు. ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది.

 స్టార్ ప్రొడ్యూసర్, సూపర్ హిట్ డైరెక్టర్ కాంబినేషన్‌లో

స్టార్ ప్రొడ్యూసర్, సూపర్ హిట్ డైరెక్టర్ కాంబినేషన్‌లో

ఛల్ మోహన్ రంగ చిత్రం తరువాత నితిన్ చేస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. దిల్ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో నితిన్ నటిస్తున్న చిత్రం ఇదే.శతమానం భవతి వంటి సూపర్ హిట్ మూవీ తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న చిత్రం ఇది.

 వరుస సినిమాలతో జోరు

వరుస సినిమాలతో జోరు

నితిన్ వరుసగా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవల విజయాలతో నితిన్ క్రేజ్, మార్కెట్ పెరిగింది.

 ఇప్పుడు పవన్ కళ్యాణ్.. నెక్స్ట్ కమల్ హాసన్

ఇప్పుడు పవన్ కళ్యాణ్.. నెక్స్ట్ కమల్ హాసన్

నితిన్ కు మరో బంపర్ ఆఫర్ దక్కింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నటిస్తున్న నితిన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో నటించే అవకాశం కూడా దక్కింది. ఓ ప్రెంచ్ సినిమా రీమేక్ గా ఈ చిత్రం రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై నితిన్ వైపు నుంచి స్పందన రావలసి ఉంది.

 రాజకీయాలతో బిజీ కావడం వలనే

రాజకీయాలతో బిజీ కావడం వలనే

కమల్ హాసన్ సొంతంగా పార్టీ స్థాపించి పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. దీనితో మార్ సినిమాలో నటించానని ఆయన తేల్చేసారు. ఈ నేపథ్యంలో తన రాజ్ కమల్ బ్యానర్ పై మాత్రం సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నారు.

నితిన్ కోసం

నితిన్ కోసం

టాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న నితిన్ ని కమల్ అప్రోచ్ అయ్యారట. ఓ ప్రెంచ్ సినిమా రీమేక్ లో నటించడానికి కమల్ నితిన్ ని అడిగినట్లు తెలుస్తోంది.

 మరో విశేషం

మరో విశేషం

ఈ చిత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. తన నటనతో కట్టిపడేసే విలక్షణ నటుడు విక్రమ్ కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

కీలక పాత్ర

కీలక పాత్ర

విక్రమ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

చీకటి రాజ్యం దర్శకుడు

చీకటి రాజ్యం దర్శకుడు

చీకటి రాజ్యం దర్శకుడు రాజేష్ సెల్వం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రెంచ్ మూవీ రీమేక్ హక్కులని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రిప్రొడెక్షన్ కూడా పార్రంభం అయ్యిందట.

క్రేజీ కాంబినేషన్

క్రేజీ కాంబినేషన్

కమల్ హాసన్, విక్రమ్ మరియు నితిన్ ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. శ్రీవివాస కళ్యాణ్ చిత్రంతో బిజీగా ఉన్న నితిన్.. కమల్ చిత్రంపై స్పందించాల్సి ఉంది.

English summary
Nithin in Kamal Hassan and Vikram Film. Hassan and Vikram produce this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu