పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్.... నితిన్ మూవీ పరిస్థితి ఏంటి?
'నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గురించి కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేదు. ఈ చిత్ర నిర్మాణంలో పవన్ కళ్యాణ్‌కు చెందిన సంస్థ భాగస్వామిగా ఉండటం, మరో వైపు పవర్ స్టార్ సినిమాలను వదిలేసి కొన్ని రోజులుగా సినిమాల్లో బిజీ అవ్వడంతో ఈ సినిమా పరిస్థితి ఏమైందనే సందేహం చాలా మందిలో ఉంది. తాజాగా ఈ చిత్ర బృందం నుండి స్పష్టమైన క్లారిటీ వచ్చింది.
Recommended Video


ఒక్క పాట మినహా పూర్తయింది.
మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్, ఊటీ, అమెరికాలో ఈ మూవీని చిత్రీకరించారు.

సినిమా రిలీజ్ డేట్ ప్రకటన
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ....' ఈ నెల 12న చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నామని తెలిపారు. అలాగే చిత్రం టీజర్ ను ప్రేమికులరోజు అయిన ఈ నెల 14న, సినిమాను ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది
చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ..' ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు. ప్రస్తుతం తమ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది' అని తెలిపారు.

ప్రధాన తారాగణం
ఈ చిత్రంలో డా.కె.వి.నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్ తదితరులు నటిస్తున్నారు.

తెరవెనక
సంగీతం: థమన్.ఎస్.ఎస్.,కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, , కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు:శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ; సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి, నిర్మాత: .సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కృష్ణ చైతన్య.


Click it and Unblock the Notifications











