నితిన్ కొత్త సినిమాకు అదిరిపోయే టైటిల్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో!
ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం చిత్రంతో బిజీగా ఉన్న నితిన్ త్వరలో వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. శ్రీనివాస కళ్యాణం చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఛలో చిత్రంతో తనలోని ప్రతిభని దర్శకుడు వెంకీ కుడుములు చాటుకున్నాడు. నితిన్ తో తెరకెక్కించే చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.

తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సింగిల్ ఫారెవర్ అనేది ట్యాగ్ లైన్. భీష్మ అనే పేరు వినగానే మహాభారత పురాణంలో భీష్ముడు గుర్తుకు వస్తాడు. అతడు ఆజన్మ బ్రహ్మచారి. అలాంటి టైటిల్ నితిన్ ప్రేమ కథ చిత్రానికి పెట్టడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











