వైరల్‌గా మారిన నితిన్ కొత్త సినిమా టైటిల్ లోగో.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం శ్రీనివాసకళ్యాణం చిత్రంలో నటిస్తునాడు. ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. ఆగష్టు నెలలో శ్రీనివాసకల్యాణం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదలైన వెంటనే నితిన్ మరో సినిమాని ప్రారంభించబోతున్నారు.
ఛలో చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సింగిల్ ఫర్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. తాజగా ఈ టైటిల్ తో నితిన్ కొత్త సినిమా అంటూ సోషల్ మీడియాలో టైటిల్ లోగో ఒకటి వైరల్ గా మారింది.

ఈ టైటిల్ లోగోలో షూటింగ్ ప్రారంభమైందని కూడా ప్రస్తావించారు. నెటిజన్లు దీనిని వైరల్ గా మార్చడంతో దర్శకుడు వెంకీ కుడుముల స్పందించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైటిల్ లోగో నిజమైనది కాదని వెంకీ క్లారిటీ ఇచ్చాడు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించాడు. త్వరలోనే చిత్రం గురించి అన్ని విషయాలు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపాడు.



Click it and Unblock the Notifications











