నితిన్ జోరు.. త్వరలోనే సెట్స్ పైకి భీష్మ!
నితిన్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం ఆగష్టు 9న విడుదలకు సిద్ధం అవుతోంది. తదుపరి చిత్రంలో నితిన్ ఛలో దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి.
ఈ చిత్రానికి సంబందించిన తాజా అప్డేట్ వచ్చింది. ఆగష్టు నెలాఖరు నుంచే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్ పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ కోసం వెంకీ కుడుములు రొమాంటిక్ లవ్ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వినోదాత్మక అంశాలు కూడా అధికంగా ఉంటాయట.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఛలో విజయంతో వెంకీ కుడుముల అందరి దృష్టిని ఆకర్షించాడు. నితిన్ కు సరిపోయే కథ సిద్ధం చేయడంతో యంగ్ హీరో వెంటనే ఒకే చెప్పేశాడు.


Click it and Unblock the Notifications











