నితిన్ సినిమా ఆగిపోయిందా.. హీరో, డైరెక్టర్ మధ్య ఏం జరిగింది..!
హీరో నితిన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. నితిన్ ప్రస్తుతం రౌడీ ఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణంలో తెరకెక్కుతోంది. కాగా నితిన్ తరువాత గరుడ వేగా ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రం ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి కారణాలు తెలియకున్నా హీరో, డైరెక్టర్ మధ్య ఏదో జరిగినట్లు ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి.
Recommended Video


త్రివిక్రమ్, పవన్ నిర్మాణంలో
కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్వయంగా కథని అందిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దిల్ రాజు నిర్మాణంలో
కృష్ణ చైతన్య దర్శత్వంలోని చిత్రం ముగిసిన వెంటనే నితిన్ దిల్ రాజు నిర్మాణంలో నటించనున్నాడు. శతమానం భవతి సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో నితిన్ కు హీరోయిన్ గా నందిత శ్వేతని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

త్వరలో అంటూ నితిన్ ప్రకటన
కాగా ఆ మధ్యన ప్రవీణ్ సత్తారు నితిన్ కు ఓ కథని వినిపించారు. ఆ కథ నచ్చడంతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించబోతున్నా అంటూ నితిన్ ప్రకటించాడు కూడా. త్వరలోనే ఈ చిత్రం పార్రంభం అవుతుందని నితిన్ తెలిపాడు.

రామ్ చేతుల్లోకి
ప్రవీణ్ సత్తారు నితిన్ కు వినిపించిన కథ ఇప్పుడు హీరో రామ్ చేతుల్లోకి వెళ్లిందట. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నితిన్, ప్రవీణ్ మధ్య ఏం జరిగింది
నితిన్ ఒకే చేసిన కథని రామ్ వద్దకు దర్శకుడు ప్రవీణ్ ఎందుకు తీసుకుని వెళ్లాడు అనే చర్చ మొదలైంది. నితిన్ దిల్ రాజు నిర్మాణంలో నటించడానికి రెడీ అవుతుండడమే ఇందుకు కారణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి ఆలస్యం అవుతుందని భావించిన ప్రవీణ్.. రామ్ తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడట.


Click it and Unblock the Notifications











