బూతులు విని భయపడ్డ నితిన్!
తను దర్శకత్వం వహించిన 'ఈ రోజుల్లో' సినిమా భారీ విజయం సాధించడంతో మంచి జోష్ మీద ఉన్నాడు దర్శకుడు మారుతి. యువ హీరోలతో యూత్ ఫుల్ సినిమాలు తీస్తూ టాప్ దర్శకుల జాబితాలో చేయాలని ట్రై చేస్తున్నాడు. ఈ మేరకు ఆయన తొలుత ఎంచుకున్న హీరో నితిన్.
ఇటీవల 'ఇష్క్' చిత్రంతో హిట్ కొట్టిన నితిన్ తన వద్ద ఉన్న కథలకు సరిగ్గా సరిపోతాడని భావించిన ఈ దర్శకుడు ఇటీవల నితిన్ వద్దకు వెళ్లి ఓ కథ వినిపించాడట. అయితే సబ్జెక్టులో ఎక్కవగా బూతులు ఉండటంతో ఆ స్టోరీ అయితే చేయడానికి నితిన్ నో చెప్పినట్లు తెలుస్తోంది.
చాలా కాలంగా ప్లాపులతో సతమతం అయిన నితిన్ 'ఇష్క్' చిత్రంతో ఫాంలోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో బూతు సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వెళితే మళ్లీ దెబ్బతింటానేమోనని భయపడుతున్నాడు. దీంతో దర్శకుడు మారుతి వేరే కథను నితిన్‌కు వినిపించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ఈరోజుల్లో సినిమాలో కూడా బూతులు ఉన్నాయనే విమర్శలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్వయంగా ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు కూడా. అయితే నేటి యువత లైఫ్ స్టయిల్ కు సినిమా దగ్గరగా ఉండటం, ఎంటర్ టైన్మెంట్ పాళ్లు బాగా కుదరడంతో సినిమా విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











