»   » లక్కీ డేట్: నితిన్ కొత్త చిత్రం ఇలా...(ఫోటోలు)

లక్కీ డేట్: నితిన్ కొత్త చిత్రం ఇలా...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఫిబ్రవరి 24 అనేది నితిన్‌కు చాలా చాలా స్పెషల్ డే. దాదాపు డజను వరుస పరాజయాలు వెంటాడటంతో ఇక ఇండస్ట్రీలో నితిన్ పని అయిపోయినట్లే అని అంతా అనుకున్న సమయంలో ఫిబ్రవరి 24వ తేదీన విడుదలైన తన 'ఇష్క్' చిత్రం విడుదలతో ప్లాపుల పరంపర నుండి బయట పడ్డాడు ఈ యంగ్ హీరో.

  ఇపుడు అదే లక్కీ డేట్ రోజున మళ్లీ తన కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన 'హార్ట్ ఎటాక్' చిత్రంతో హిట్ కొట్టిన నితిన్ ఇపుడు శ్రీనివాసరెడ్డి బోసాని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈచిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం నితిన్ ఆఫీసులో జరిగింది.

  ఇందుకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

  నిర్మాత రామారావు క్లాప్

  నిర్మాత రామారావు క్లాప్


  దేవుని పటాలపై చిత్రీకరించిన తొలిషాట్‌కు నిర్మాత రామ్‌మోహ్మన్‌రావు క్లాప్‌నిచ్చారు. ఈచిత్రాన్ని శ్రావనా సినిమాస్‌ పతాకంపై నితిన్ సోదరి నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు.

  సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం

  సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం


  సదానంద్‌గౌడ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు సురేందర్‌ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

  శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయం

  శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయం


  సురేందర్ రెడ్డి దగ్గర పని చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా స్క్రిప్టును నితిన్, నిఖితా రెడ్డి దర్శకుడికి అందిస్తున్న దృశ్యం.

  మణిశర్మ కొడుకు సంగీతం

  మణిశర్మ కొడుకు సంగీతం


  ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించారు. నిర్మాత నిఖితా రెడ్డి మాట్లాడూ శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రావనా సినిమాస్‌ అనే కొత్త బ్యానర్‌ పై సరికొత్త ప్రేమకధా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. నితిన్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది, మార్చి మూడో వారంనుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంబిస్తామని తెలిపారు.

  కాస్ట్ అండ్ క్రూ

  కాస్ట్ అండ్ క్రూ


  హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైన్ కాలేదు. ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, సోనూసూద్‌, అజయ్‌ తదితరులు నటిస్తున్నారు. మాటలు: హర్షవర్ధన్‌, స్ర్కీన్‌ ప్లే: ముకుంద్‌ పాండే, సంగీతం: సాగర్‌ మహతి, ఆర్ట్‌ :రాజీవ్‌ నాయర్‌, కూర్పు :ప్రవీణ్‌ పూడీ, ఫైట్స్‌:విజయ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: వెంకటరత్నం, నిర్మాత :నిఖితా రెడ్డి , కధ-దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి బోసాని.

  English summary
  February 24 is very special day for Telugu actor Nithin Reddy as this dates marks the release of his hit movie Ishq, which brought back his lost glory after tasting a series of flops. Which is why the actor, who is basking on the success of his recent release Heart Attack, launched his new film on the same date at his office in Hyderabad.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more