అరవింద సమేత సూపర్ హిట్ ఓబా.. ఎన్టీఆర్‌ని ఇలా చూడాలని ఎప్పటి నుంచో.. నితిన్!
Recommended Video

అరవింద సమేత చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినీ ప్రముఖుల నుంచి ఈ చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. త్రివిక్రమ్ పవర్ ఫుల్ గా రూపొందించిన ఫ్యాక్షన్ కథలో ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. విజిల్స్ పెట్టించే యాక్షన్ సీన్స్, హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సీన్స్ లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. తాజగా యంగ్ హీరో నితిన్ అరవింద సమేత చిత్రంపై ప్రశంసలు కురిపించాడు.

ఇప్పుడే అరవింద సమేత చూశా
తాను కొద్ది సేపటి క్రితమే అరవింద సమేత చిత్రం చూశానని నితిన్ ట్వీట్ చేశాడు. రచయితగా, దర్శకుడిగా మరోమారు త్రివిక్రమ్ శ్రీనివాస్ అదరగొట్టారని నితిన్ పేర్కొన్నాడు. రాయలసీమ యాసలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

సూపర్ హిట్ ఓబా
ఎన్టీఆర్ ఫెర్ఫామెన్స్ అదరిపోయిందని నితిన్ పేర్కొన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం, ఎన్టీఆర్ నటనతో అదరగొట్టగా.. రామ్ లక్ష్మణ్ ఫైట్స్, తమన్ సంగీతం సినిమాని మరో స్థాయికి చేర్చాయని నితిన్ పేర్కొన్నాడు. అరవింద సమేత సూపర్ హిట్ ఓబా అంటూ కామెంట్ పెట్టాడు.

ఎన్టీఆర్‌ని ఇలా చూడాలని
ఎన్టీఆర్‌ని ఇలాంటి పవర్ ఫుల్ రోల్‌లో చూడాలని తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్నానని, చివరకు త్రివిక్రమ్ తన కోరిక తీర్చారని నితిన్ తెలిపాడు. నితిన్, త్రివిక్రమ్ కాబినేషన్‌లో వచ్చిన అ..ఆ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కొత్త చిత్రానికి రెడీ
అరవింద సమేత చిత్రం అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. నితిన్ సహా సినీ ప్రముఖులంతా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా నితిన్ కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. వెంకీ కుడుముల దర్శత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ రష్మిక హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











