డబ్బులు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు.. అలా పెళ్లి చేసుకోవడం నచ్చదు.. నితిన్ కామెంట్స్

అంతా సవ్యంగా ఉండుంటే.. ఈపాటి యంగ్ హీరో నితిన్ ఓ ఇంటి వాడయ్యేవాడు. అయితే మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని అంటారు కదా. నితిన్ విషయంలోనూ అదే జరిగింది. అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేసి, కళ్లు చెదిరేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసి ఇక అంతా సిద్దం అని అనుకునే సమయంలో కరోనా వచ్చి పిడుగే వేసింది. కరోనా వైరస్ విజృంభించడంతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి.

ఘనంగా నిశ్చితార్థం..

ఘనంగా నిశ్చితార్థం..

ఫిబ్రవరి నితిన్-షాలినీల పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇంటి సభ్యుల సమక్షంలో జరిగిన నిశ్చితార్థపు వేడుకులు ఎంత ఘనంగా జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ మేరకు తన జీవిత భాగస్వామిని సోషల్ మీడియా వేదికగా అభిమానులక పరిచయం చేశాడు నితిన్. అయితే ఏప్రిల్‌ పెళ్లి చేసుకోవాలనుకున్న నితిన్‌కు కరోనా అడ్డుపడింది.

దుబాయ్‌లో పెళ్లి..

దుబాయ్‌లో పెళ్లి..

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే పిలిచి.. దుబాయ్‌లో డెస్టినేషన్ పెళ్లి చేసుకుందామని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు నితిన్. అయితే కరోనా వైరస్ విస్తరిస్తూ ఉండటంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. తాజాగా ఈ విషయాల గురించి ఓ మీడియాతో మాట్లాడుతూ.. అనేక విషయాలు వెల్లడించాడు.

డబ్బులుపోతే సంపాదించుకోవచ్చు..

డబ్బులుపోతే సంపాదించుకోవచ్చు..

లాక్ డౌన్ ముందు పెళ్లి, సినిమా, షూటింగ్‌లు చిన్నవేనని, డబ్బులు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చని నితిన్ చెప్పుకొచ్చాడు. సినిమాలు పోతే మళ్లీ హిట్ చిత్రాలు తీయవచ్చని తెలిపాడు. కానీ వాటన్నంటికంటే ముందు మనం బాగుండాలి.. మనం బాగుంటేనే అన్ని బాగుంటాయని పేర్కొన్నాడు.

Recommended Video

Nithiin Emotional Speech At Bheeshma Success Meet
అలా పెళ్లి చేసుకోవడం నచ్చదు..

అలా పెళ్లి చేసుకోవడం నచ్చదు..

పెళ్లిని వాయిదా వేయడం గురించి నితిన్ చెబుతూ.. జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే జరుగుతుందని, అది సంతోషంగా చేసుకోవాలి గానీ భయంగా మాస్క్ వేసుకని చేసుకోవడం తనకు నచ్చదని పేర్కొన్నాడు. అందుకే పెళ్లిని వాయిదా వేశానని, మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పాడ్డాక చేసుకుంటామని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X