ఛలో దర్శకుడితో నితిన్.. హీరోయిన్ దొరికింది!
ఛల్ మోహన్ రంగ చిత్రంతో నితిన్ కు నిరాశే ఎదురైంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో నితిన్ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. నితిన్ ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉండగా నితిన్ తదుపరి చిత్రానికి కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. శ్రీనివాస కళ్యాణం చిత్రం పూర్తయ్యాక నితిన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి హీరోయిన్ కూడా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు పొందిన మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

మెహ్రీన్ ప్రస్తుతం పంతం, వరుణ్ తేజ్, వెంకీ మల్టీస్టారర్ చిత్రం, విజయ్ దేవర కొండా నోటా చిత్రాలలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. నితిన్ తన సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీనివాస కళ్యాణం చిత్రం పూర్తి కాగానే ఈ చిత్రాన్ని పట్టాలపైకి తీసుకునివెళ్ళానునట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











