నితిన్ ‘గుండె గల్లంతైందే’చిత్రం ప్రారంభం
ఈ సందర్భంగా నితిన్‌పై చిత్రీకరించిన తొలి దృశ్యానికి సదానంద్‌గౌడ్ కెమెరా స్విచాన్ చేయగా నిర్మాత రామ్మోహన్‌రావు క్లాప్ ఇచ్చారు. నందినీరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నితిన్ మాట్లాడుతూ -''నా కెరీర్‌లోనే 'ఇష్క్' బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సంస్థలో చేస్తున్న ఈ రెండో చిత్రం వినోద ప్రధానంగా సాగుతుంది. ప్రేమ, కుటుంబ అనుబంధాల చుట్టూ సాగే కథ. సాంకేతికంగా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది'' అన్నారు.
నిఖితారెడ్డి మాట్లాడుతూ -''ఈ నెల ఇరవై రెండున రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు చేస్తాం. డిసెంబర్‌తో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇది'' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఆండ్రూ బాబు, నిర్మాణ నిర్వహణ: వెంకటరత్నం.
మరో ప్రక్క నితిన్, నిత్యామీనన్ జంటగా రూపొందిన 'ఇష్క్' చిత్రాన్ని తమిళంలో జయప్రద రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా తన సోదరి కుమారుడు సిద్ధార్థ్‌ని కోలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నారు. ఆల్రెడీ తమిళ్‌లో నాలుగు చిత్రాల్లో నటించి, మరో మూడు చిత్రాల్లో నటిస్తున్న హన్సికను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నారామె. హన్సిక మాట్లాడుతూ...ఈ చిత్రకథ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి 'ఇష్క్' చూశానని, హీరోయిన్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉందని హన్సిక చెప్పారు. తెలుగులో విజయం సాధించింది కాబట్టి, ఈ చిత్రకథ ప్రూవ్ అయ్యిందని, అందుకే అంగీకరించానని కూడా పేర్కొన్నారు. ఈ రీమేక్‌లో నటించే అవకాశం రావడం చాలా థ్రిల్‌గా ఉందని కూడా ఈ బ్యూటీ చెప్పారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












