twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నితిన్ ‘గుండె గల్లంతైందే’చిత్రం ప్రారంభం

    By Srikanya
    |

    హైదరాబాద్ : నితిన్ హీరోగా 'ఇష్క్' వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శ్రేష్ట్ మూవీస్, నితిన్‌తో 'గుండె గల్లంతైందే' అనే టైటిల్ తో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. విక్రమ్‌గౌడ్ సమర్పణలో నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌కుమార్ దర్శకుడు. నితిన్ సరసన నిత్యామీనన్, ఇషాతల్వార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వినాయిక చవితి పర్వ దినాన్ని పురస్కరించుకుని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.

    ఈ సందర్భంగా నితిన్‌పై చిత్రీకరించిన తొలి దృశ్యానికి సదానంద్‌గౌడ్ కెమెరా స్విచాన్ చేయగా నిర్మాత రామ్మోహన్‌రావు క్లాప్ ఇచ్చారు. నందినీరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నితిన్ మాట్లాడుతూ -''నా కెరీర్‌లోనే 'ఇష్క్' బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సంస్థలో చేస్తున్న ఈ రెండో చిత్రం వినోద ప్రధానంగా సాగుతుంది. ప్రేమ, కుటుంబ అనుబంధాల చుట్టూ సాగే కథ. సాంకేతికంగా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది'' అన్నారు.

    నిఖితారెడ్డి మాట్లాడుతూ -''ఈ నెల ఇరవై రెండున రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు చేస్తాం. డిసెంబర్‌తో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇది'' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఆండ్రూ బాబు, నిర్మాణ నిర్వహణ: వెంకటరత్నం.

    మరో ప్రక్క నితిన్, నిత్యామీనన్ జంటగా రూపొందిన 'ఇష్క్' చిత్రాన్ని తమిళంలో జయప్రద రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా తన సోదరి కుమారుడు సిద్ధార్థ్‌ని కోలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నారు. ఆల్రెడీ తమిళ్‌లో నాలుగు చిత్రాల్లో నటించి, మరో మూడు చిత్రాల్లో నటిస్తున్న హన్సికను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నారామె. హన్సిక మాట్లాడుతూ...ఈ చిత్రకథ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి 'ఇష్క్' చూశానని, హీరోయిన్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉందని హన్సిక చెప్పారు. తెలుగులో విజయం సాధించింది కాబట్టి, ఈ చిత్రకథ ప్రూవ్ అయ్యిందని, అందుకే అంగీకరించానని కూడా పేర్కొన్నారు. ఈ రీమేక్‌లో నటించే అవకాశం రావడం చాలా థ్రిల్‌గా ఉందని కూడా ఈ బ్యూటీ చెప్పారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Sresth Movies that produced super hit, Ishq, with Nithin has begun its second film again with the same lead pair. The film is titled Gunde Jari Gallanthayyindhe, a line taken from super hit song from Pawan Kalyan's Gabbar Singh. The film was launched on Sept 19th at the producer's office on the occasion of Ganesh Chaturthi festival. Nikitha Reddy is producing the film while Vikram Goud presents it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X