»   » నితిన్ ‘హార్ట్ ఎటాక్’ లుక్ లీకైందోచ్..(ఫోటోలు)

నితిన్ ‘హార్ట్ ఎటాక్’ లుక్ లీకైందోచ్..(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ హీరో నితిన్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'హార్ట్ ఎటాక్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నితిన్ డిఫరెంటు లుక్ తో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రంలో నితిన్ లుక్‌కు సంబంధించిన ఫోటోలను ఆన్ లైన్లో లీక్ చేసారు. సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది.

ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇటీవల జరిగి తొలి షెడ్యూల్ క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీన్‌ చిత్రీకరించారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన ఆదా శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. వైష్ణో అకాడమీ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు.

పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం యూరఫ్ బయల్దేరి వెళ్లింది. ఇక్కడే సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ జరుగనుంది.

నితిన్ హ్యాపీ

నితిన్ హ్యాపీ


నితిన్ ఈ సినిమాపై ఎంతో సంతోషంగా, నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్.

పోరికి ప్రేమికుడిగా నితిన్

పోరికి ప్రేమికుడిగా నితిన్


ఈ చిత్రంలో ఈసారి నితిన్‌ని ఓ పోకిరి ప్రేమికుడిగా చూపించబోతున్నారు. క్యారక్టరైజేషన్ తో సినిమా నడుస్తుందని తెలుస్తోంది.

ప్రేమకథాంశంతో...

ప్రేమకథాంశంతో...


మాస్‌, క్లాస్‌ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్‌ గెటప్‌, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు యువతరాన్ని అలరించే విధంగా ఉండనున్నాయి.

పూరీ జగన్నాథ్ ప్రత్యేకమైన శైలి

పూరీ జగన్నాథ్ ప్రత్యేకమైన శైలి


ప్రేమ కథలు తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్‌ది ప్రత్యేక శైలి. అందులోనే వినోదం, పోరాట దృశ్యాలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్‌'. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది. నితిన్‌ సరసన ఆదా శర్మ హీరోయిన్ . ప్రస్తుతం స్పెయిన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు.

English summary
Nithin's upcoming movie 'Heart Attack' photos leaked. Usually the lead characters in Puri Jagannath's film bear a rough characterization. Now it's Nitin's time. Now Puri is also taking special care about Nitin. He is presenting Nitin in a ultra-stylish look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu