నితిన్, సమంత సినిమా రికార్డుల మోత.. రెండు రోజుల్లోనే ఇంత సంచలనమా!
యంగ్ హీరో నితిన్, సమంత జంటగా నటించిన చిత్రం అ..ఆ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నితిన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ శైలి, ఆధ్యంతం ఆకట్టుకున్న డైలాగ్స్ ఈ చిత్రానికి బలాన్ని చేకూర్చాయి. నితిన్, సమంత జంట కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. 2016 లో విడుదలైన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. తాజగా ఈ చిత్రం మరో రికార్డు మొదలు పెట్టింది.

హిందీ వర్షన్
ఇటీవల అ.. ఆ.. చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.టాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలకు యూట్యూబ్ లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఏ చిత్రానికి కూడా అదే జరిగింది.

రెండు రోజుల్లోనే
ఆగష్టు 26 న అ.. ఆ చిత్ర హిందీ వర్షన్ ని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. రెండు రోజుల్లోపే ఈ చిత్రం 11 మిలియన్ల వ్యూస్ తో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి 16 మిలియన్ల వ్యూస్ దక్కాయి.

టాలీవడ్ సినిమాలు
హిందీలో డబ్ అయిన మన టాలీవుడ్ చిత్రాలు యూట్యూబ్ లో దూసుకుపోతుంటాయి. అల్లు అర్జున్ నటించిన సరైనోడు, దువ్వాడ జగన్నాథం చిత్రాలు ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఉన్న సంగతి తెలిసిందే.

కుటుంబకథా చిత్రం
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన అ..ఆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. యూట్యూబ్ లో మరిన్ని రికార్డులు సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో విజువల్స్, సంగీతం అన్ని ఆకట్టుకునే అంశాలే.


Click it and Unblock the Notifications











