నితిన్ సినిమా విడుదల తేది ఖరారు... అప్పుడు హిట్ మరి ఇప్పుడు?
యువ హీరో నితిన్, రాశీ ఖన్నా జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి సినిమాతో మంచి సక్సెస్ సాధించిన దర్శకుడు సతీష్ వేగ్నేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం దిల్ హీరో నితినే. మళ్లీ ఈ క్యాంబినేషన్ లో సినిమా రాబోతుండడం విశేషం.
ఈ మూవీలో రాశీఖన్నా తో పాటు నందితా శ్వేతాలు మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోయే ఈ సినిమా ఆగష్టు 9న విడుదల చెయ్యడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో శ్రీనివాస కల్యాణం సినిమా సక్సెస్ పై ఆశలు పెట్టుకున్నాడు నితిన్.

ముప్పై ఏళ్ళ క్రితం వెంకటేష్ - భానుప్రియ - గౌతమి ప్రధాన పాత్రల్లో వచ్చిన శ్రీనివాస కల్యాణం సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడురాబోతున్న శ్రీనివాస కళ్యాణం సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











