శ్రీనివాస కళ్యాణం ప్రీరిలీజ్ బిజినెస్ అదుర్స్.. నితిన్‌కు రెండో బిగ్గెస్ట్, హిట్ కావాలంటే!
యంగ్ హీరో నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. విడుదలకు ముందే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొనివుంది. సూపర్ హిట్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందడం విశేషం. నితిన్ కెరీర్ లో సూపర్ హిట్ మూవీ దిల్ తరువాత దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న రెండవ చిత్రం ఇది. దర్శకుడు సతీష్ వేగేశ్న, దిల్ రాజు గత ఏడాది శతమానం భవతి చిత్రంతో అదిరిపోయే హిట్ కొట్టారు. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు చూద్దాం.

దిల్ రాజు సొంతంగా
దిల్ రాజు ఈ చిత్రాన్ని సొంతంగా నైజాం ఏరియాలో విడుదల చేస్తున్నారు. నైజాం ఏరియా రైట్స్ 7 కోట్లుగా అంచనా వేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు నైజం ఏరియాలో మంచి పట్టు ఉంది. దీనితో ఆయన నిర్మించిన చిత్రం అయినప్పటికీ సొంతంగానే పంపిణి చేస్తున్నారు.

ఆంధ్రలో
ఆంధ్ర ప్రాంతంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 10 కోట్ల వరకు జరిగింది. రేషియో ఒప్పందం ప్రకారం ఈ డీల్ కుదిరింది. సీడెడ్ లో ఈ చిత్ర హక్కులు 4 కోట్లకు అమ్ముడయ్యాయి.

ఓవర్సీస్
ఓవర్సీస్ లో శ్రీనివాస కళ్యాణం చిత్రం మంచి ధరే పలికింది. 3 కోట్లకు ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు అమ్ముడయ్యాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా బిజినెస్ లో 1.80 కోట్లకు వరకు బిజినెస్ జరిగింది. మొత్తంగా శ్రీనివాస కళ్యాణం చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 25.80 కోట్లుగా తేలింది. నితిన్ కెరీర్ లో అ.. ఆ చిత్రం తరువాత ఆస్థాయిలో శ్రీనివాస కళ్యాణం చిత్రానికి బిజినెస్ జరిగింది.

పాజిటివ్ బజ్
ప్రీరిలీజ్ బిజినెస్ ఘనంగానే ఉంది కానీ విడులయ్యాక ఈమేరకు వసూలు చేస్తుందో చూడాల్సి ఉంది. కనీసం 30 కోట్లు రాబట్టినా ఈ చిత్రం సూపర్ హిట్ లెక్కలో పడ్డట్లే. పూర్తి పాజిటివ్ బజ్ తో విడుదల కానుండడం ఈ చిత్రానికి కలసి వచ్చే అంశం.


Click it and Unblock the Notifications











