'జయం' తర్వాత సరైన హిట్టు లేక వరస అపజయాల్లో కూరుకుపోతున్న హీరో నితిన్. ఇప్పుడు 'విక్టరి' నాదేనంటూ సామాన్యుడు డైరక్టర్ రవి సి.కుమార్ తో వస్తున్నాడు. మమతా మోహన్ దాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. కదలని కెరీర్ తో కొట్టుమిట్టాడుతున్న జగపతిబాబుకి 'సామాన్యుడు'తో హిట్ ఇచ్చిన దర్శకుడు రవి చావాలి 'విక్టరి'కి డైరక్టర్ కావటంతో పరిశ్రమ కూడా మంచి ఎక్సెపెక్టేషన్ తో ఎదురుచూస్తోంది. అలాగే నితిన్ 'ఆటాడిస్తా' అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నిరాశని మిగిల్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై నితిన్ కెరిర్ కి చాలా కీలకమైంది. దాంతో ఈ సినిమాపైనే అతనికి ఆశలు ఉన్నాయి. ఈ నెల చివరలో చక్రి సమకూర్చిన పాటల ఆడియో రిలీజు అవుతోంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా మే సెకండ్ వీక్ రిలీజు చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.