‘అత్తారింటికి దారేది' కోసం షూటింగ్ కాన్సిల్ చేసుకున్నా
నితిన్ ట్వీట్ లో ... ఖుషీ తర్వాత నేను మొదటి రోజు మార్నింగ్ షో మెయిన్ థియోటర్ లో చూస్తున్న చిత్రం పవర్ స్టార్ అత్తారింటికి దారేది . సంధ్య థియోటర్ లో చూస్తున్నా...సూపర్ ఎక్సైటింగ్ గా ఉంది. పూరీ సార్ ని రిక్వెస్ట్ చేసా..మార్నింగ్ షో కి సినిమాకు వెళ్తానని..ఆయన షూటింగ్ కాన్సిల్ చేసారు..అన్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నైజాం ఏరియాలో నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి గ్లోబల్ సినిమా సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైన నేపథ్యంలో నితిన్ తీవ్రంగా స్పందించారు. పైరసీకి ప్రధాన కారణం ఎడిటర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ అని తెలిసి....నితిన్ షాక్‌కు గురయ్యాడు. ఎందకంటే నితిన్ నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే'కి కూడా అరుణ్ కుమార్ పని చేసాడు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రానికి కూడ అరుణ్ కుమార్ పని చేస్తున్నాడట.
'ఎడిటర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ అత్తారింటికి దారేది చిత్రాన్ని బయటకు లీక్ చేసాడని తెలిసి నమ్మలేకపోతున్నాను. ఇతడు 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రానికి పని చేసాడు. ఇపుడు 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రానికి కూడా పని చేస్తున్నాడు. ఎంతో షాకయ్యాను. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటి ఆలోచన రావాలంటేనే ఉచ్చ పడిపోవాలి' అంటూ ట్వీట్ చేసాడు.


Click it and Unblock the Notifications












